Wednesday, January 8, 2025

బ్లేజ్ ప్రో 5జిని విడుదల చేసిన లావా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారతీయ స్మార్ట్‎ఫోన్ బ్రాండ్ అయిన లావా తన తాజా స్మార్ట్‎ఫోన్ – ది లావా బ్లేజ్ ప్రో 5జి ని కేవలం రూ.12,499కు అందిస్తున్నట్లుగా ప్రకటించింది. మీడియా టెక్ డైమెన్సిటి 6020 సూపర్-ఫాస్ట్ ప్రాసెసర్ ఉన్న ఈ బ్లేజ్ ప్రో 5జి పనితీరులో ఒక స్మార్ట్‎ఫోన్ అందించగలిగే వాటిల్లో, యూజర్ అనుభవములో ఒక కొత్త ప్రామాణికాన్ని నెలకొల్పుతుంది. బ్లేజ్ ప్రో 5జి ఆండ్రాయిడ్ 13 బ్లోట్‎వేర్ రహితమైన ఓఎస్ ఆధారితమైనది, 128 జిబి స్టోరేజ్, 16 జిబి వరకు పొడిగించదగిన 8 జిబి RAM కలిగి ఉంది. ఇది లావా యొక్క రీటెయిల్ నెట్వర్క్ లో, ఆన్లైన్ ప్లాట్ఫార్మ్–అమెజాన్ పై అక్టోబర్ 3 నుండి అందుబాటులో ఉంటుంది.

రంగు మారే బ్యాక్ ప్యానల్ కలిగిన ఈ స్మార్ట్‎ఫోన్.. స్టేరీ నైట్, రేడియంట్ పెరల్ రెండు రంగులలో అందుబాటులో ఉంటుంది.  బ్లేజ్ ప్రో 5జి యొక్క ప్రత్యేక ఫీచర్స్ లో దాని ఇమ్మర్సివ్ 6.78-ఇంచ్ 120 Hz డిస్ప్లే ఒకటి. ఈ అద్భుతమైన స్క్రీన్ ఆకర్షణీయమైన రంగులు, డీప్ కాంట్రాస్ట్స్, షార్ప్ వివరాలను అందిస్తుంది, తద్వారా మల్టీమీడియా వినియోగము, గేమింగ్, ఉత్పాదక పనులకు ఇది ఖచ్ఛితమైనదిగా నిలుస్తుంది. ఫోటోగ్రహీ ఔత్సాహికులు ఈఐఎస్ సపోర్ట్ తో వచ్చే బ్లేజ్ ప్రో 5జి 50 ఎంపి డ్యుయల్ రియర్ కెమెరాతో చాలా ఆనందిస్తారు. ముందువైపు స్క్రీన్ ఫ్లాష్ తో 8 ఎంపి కెమెరా ఉంటుంది. స్మార్ట్‎ఫోన్ యొక్క ఆధునిక కెమెరా సాఫ్ట్‎వేర్ ఏఐ-ఆధారితమైన ఆప్టిమైజేషన్స్ ద్వారా చిత్రాలను మెరుగ్గా చూపుతుంది, ప్రతి ఒక్క షాట్ ను పిక్చర్-పర్ఫెక్ట్ గా చేస్తుంది. అదనంగా, స్మార్ట్‎ఫోన్ లో 5000 mAh బ్యాటరీ ఉంది, ఇది వేగవంతమైన చార్జింగ్ కొరకు బాక్స్ లో 33W టైప్-సి చార్జర్ తో అసాధారణమైన ఓరిమిని అందిస్తుంది.

లావా బ్లేజ్ ప్రో 5జి ఆండ్రాయిడ్ 13 పై పనిచేస్తుంది, యూజర్స్ కు అపరిమితమైన, సహజమైన ఇంటర్ఫేస్ ను అందిస్తుంది. బ్లేజ్ ప్రో 5జి యూజర్స్ కు ‘ఉచిత ఇంటివద్ద సేవ” తో సహా ఒక క్లీన్, బ్లోట్ వేర్ ఫ్రీ ఆండ్రాయిడ్ ను అందిస్తుంది. దీని వలన వినియోగదారులు తమ ఇంటి వద్దనే సేవలను అందుకోవచ్చు. దీని ద్వారా, ఇది ఏ ఉత్పత్తినైనా రూపొందించి ప్రవేశపెట్టే ముందు వినియోగదారుడిని దృష్టిలో ఉంచుకొని, వారికి అత్యుత్తమ సేవలను అందించాలనే లావా యొక్క నిబద్ధతను నిర్ధారిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News