Saturday, December 21, 2024

కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే తో అగ్ని 2ను ప్రవేశపెట్టిన లావా..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లావా మొబైల్స్ ఈరోజు కట్టింగ్-ఎడ్జ్ టెక్నాలజితో తన ప్రపంచ-స్థాయి అగ్ని 2 5జి స్మార్ట్ ఫోన్ ను ప్రవేశపెట్టింది. ఇది మధ్య-శ్రేణి స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులకు ఒక భారతీయ ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. అగ్ని 2 5జి అన్ని కొత్త శక్తివంతమైన చిప్‎సెట్,యు సెగ్మెంట్-ఫస్ట్ విశేషాలతో ఉన్న లావా యొక్క అత్యంత ప్రావీణ్యత కలిగిన స్మార్ట్ ఫోన్.

ఇతర స్మార్ట్ ఫోన్ల కంటే మెరుగైన ఇది, వేగవంతమైన గేమింగ్, యాప్ అనుభవాన్ని అందించే మీడియాటెక్ యొక్క ఆధునిక 7050 ప్రాసెసర్ ద్వారా ఆధారితమైన భారతదేశపు మొదటి స్మార్ట్ ఫోన్.

“అగ్ని 2 5జి, భారతీయ ఫైర్ పవర్, స్మార్ట్ ఫోన్ పరిశ్రమలో భారతదేశపు ఇంజనీరింగ్ యొక్క సంగ్రహాన్ని అందిస్తుంది. ఇది రూ. 20 వేల ధరల విభాగములో భారతదేశపు వినియోగదారుల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేయబడింది. అగ్నిని ప్రపంచస్థాయిలో భారతదేశపు సాంకేతిక నైపుణ్యాన్ని చూపించే ఒక ఉత్పత్తిగా చేయడము మా లక్ష్యము. దీని ప్రపంచ-స్థాయి గుణాలు భారతీయ స్మార్ట్ ఫోన్ల గురించి మీ ఆలోచనలను మారుస్తాయి,” అని సునీల్ రైనా, ప్రెసిడెంట్ & బిజినెస్ హెడ్, లావా ఇంటర్నేషనల్ అన్నారు.

దీని ధర ఐఎన్‎ఆర్ 21,999 గా నిర్ణయించబడింది. అగ్ని 2 మే 24, 2023 నుండి amazon.in పై అన్ని ప్రధాన క్రెడిట్ & డెబిట్ కార్డ్స్ పై ఐఎన్‎ఆర్ 2000 డిస్కౌంట్ తో అందుబాటులో ఉంటుంది, దీనితో ఆరంభ ధర కేవలం ఐఎన్‎ఆర్ 19,999 అవుతుంది.

“మీడియాటెక్‎డిమెన్సిటి 7050 మృదువైన గేమింగ్ అనుభవాన్ని, అసాధారణమైన పవర్-సామర్త్యము, ఏఐ-కెమెరా మెరుగుదలలు, ఇంటలిజెంట్ పనితీరు, దీర్ఘకాల గేమింగ్ సెషన్స్ కొరకు ఎక్కువ బ్యాటరీ మన్నిక అందిస్తుంది”, అని అంకు జైన్, మేనేజింగ్ డైరెక్టర్ మీడియాటెక్ ఇండియా అన్నారు. “లావా అగ్ని2 5జి, మీడియాటెక్ 5జి అల్ట్రాసేవ్, స్ట్రీమర్స్ కొరకు శక్తివంతమైన మిరావిషన్ 4కే హెచ్‎డిఆర్ వీడియో ప్రాసెసింగ్, అత్యంత వేగవంతమైన ప్రతిస్పందన, మీడియాటెక్ హైపర్‎ఇంజన్ గేమింగ్ మెరుగుదలలతో అధిక-రెసొల్యూషన్ డిస్ప్లేలతో ఏకీకృతమైన మీడియాటెక్‎డిమెన్సిటి 7050 ద్వారా ఆధారితమైన భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్ ఫోన్. మరిన్ని కొత్త పురోగతులు మరియు విజయవంతమైన భవిష్యత్ సహకారాలతో పనిచేయాలని మేము ఆశిస్తున్నాము.”

తన 6.78 ఇంచ్ ఎఫ్‎హెచ్‎డి + 120 Hz రిఫ్రెష్ రేట్ తో స్క్రీన్ తో అగ్ని 2 అతిపెద్ద మరియు ఈ విభాగములో ఉత్తమమైన కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేను అందిస్తుంది. ఈ డిస్ప్లేకు 1.07 బిలియన్ కలర్ డెప్త్ ఉంది, ఇది నిజమైన సెగ్మెంట్ డిఫరెన్సియేటర్ మరియు హెచ్‎డిఆర్, హెచ్‎డిఆర్ 10, మరియు హెచ్‎డిఆర్ 10+ మరియు వైడ్‎వైన్ ఎల్1 ను సపోర్ట్ చేస్తుంది.

ఎర్గోనామిక్ 3డి డ్యుయల్ కర్వ్ డిజైన్ తో అగ్ని 2 పట్టుకోవటానికి సులభంగా ఉంటుంది మరియు ఆనందాన్ని ఇస్తుంది. ఇది డబల్ రీఇన్ఫోర్స్డ్ గ్లాస్ రక్షణతో మ్యాట్ ఫినిష్ తో ప్రీమియం 3డి గ్లాస్ బ్యాక్ డిజైన్ అందిస్తుంది. దీనికి అత్యంత సన్ననైన (2.3ఎంఎం) బాటం బెజెల్ ఉంది మరియు స్క్రీన్ మరియు బాడి నిష్పత్తి 93.65% ఉంది. దీనిలో కంటికి ఆకర్షణీయమైన విరిడియన్ రంగు గ్లాస్ బ్యాక్ తో వస్తుంది.

అగ్ని 2 యొక్క సూపర్ 50ఎంపి క్వాడ్ కెమెరాలో సెగ్మెంట్ ఫస్ట్ 1.0-మైక్రాన్ (1 యూఎం) పిక్సెల్ సెన్సార్ ఉంది. ఇది ఎక్కువ వెలుతురును మరియు సునిశితమైన వివరాలను సేకరిస్తుంది. వాస్తవంగా 16జిబి RAM వరకు విస్తరించగల 8జిబి RAM తో సెగ్మెంట్ లో ఉత్తమమైన 256 జిబి స్టోరేజ్ ను అగ్ని 2 అందిస్తుంది.

ఒక అద్భుతమైన గేమింగ్ అనుభవాన్ని అందించే అగ్ని 2 లో, ఆధునికమైన 3rd Gen 2900mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సాంకేతికత ఉంది. ఇది ఎక్కువగా గేమింగ్ చేసినప్పుడు ఫోన్ వేడెక్కనివ్వదు. దీనికి తోడు, ఎక్స్-ఆక్సిస్ లీనియర్ మోటార్ హాప్టిక్స్ కూడా గేమింగ్ మరియు టైపింగ్ అనుభవాన్ని పెంచుతాయి.

అగ్ని 2 13 5జి బాండ్స్ ను సపోర్ట్స్ చేస్తుంది. ఇందులో అన్ని భారతీయ మరియు ప్రధాన ప్రపంచవ్యాప్త 5జి బాండ్స్ n1/n3/n5/n7/n8/n20/n28/n38/n40/n41/n66/n77/n78 ఉన్నాయి.

ఇతర లావా స్మార్ట్ ఫోన్స్ మాదిరిగా, అగ్ని 2 కూడా క్లీన్ ఆండ్రాయిడ్ 13.0 అనుభవాన్ని అందించే లావా వాగ్ధానాన్ని నిలబెట్టుకుంటుంది – బ్లోట్ వేర్ లేదు, యాడ్స్ లేవు, అవాంఛనీయమైన నోటిఫికేషన్స్ ఉండవు, వీటికితోడు ఆండ్రాయిడ్ 14 మరియు 15 కు అప్గ్రేడ్ చేసుకునే వాగ్దానము మరియు 3 సంవత్సరాల వరకు హామీఇవ్వబడిన త్రైమాసిక భద్రతా అప్డేట్స్.

అంతేకాకుండా, ఈ సేవలో మరొక పెద్ద ముందడుగు వేస్తూ, అగ్ని2 యూజర్ల కొరకు ఇంటి వద్దనే ఉచిత ప్రత్యామ్నాయాన్ని నిర్ధారించే అగ్ని మిత్ర సర్వీస్ ను లావా అందిస్తుంది. పరిశ్రమలో ఈ మొదటి చర్యతో, వారెంటీ సమయములో, హార్డ్ వేర్ సమస్యలు ఏవైనా వస్తే, ఫోన్ మార్చబడుతుంది. ప్రతి వినియోగదారుడికి తమ సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించుటకు ప్రత్యేక వ్యక్తిగత ‘అగ్ని మిత్ర’ తో సహకారం అందించబడుతుంది.

ఇంటివద్ద సేవను అందుకొనుటకు, ఇక్కడ క్లిక్ చేయండి:https://www.lavamobiles.com/lava_service_at_home/.

66W చార్జర్ తో 4700mAh బ్యాటరీ ద్వారా అగ్ని 2 ఆధారితమైనది, ఇది 16 నిమిషాల కంటే తక్కువ సమయములో మీకు 50% చార్జింగ్ ఇస్తుంది. అగ్ని 2 5జి మే 24 మధ్యాహ్నం 12:00 గంటల నుండి ప్రత్యేకంగా ఈ-కామర్స్ ప్లాట్ఫార్మ్ Amazon.in పై ప్రత్యేకంగా అందుబాటులోకి వస్తుంది. నోటిఫికేషన్ అందుకొనుటకు, ఇక్కడ క్లిక్ చేయండి: [లింక్].

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News