ఢిల్లీ: భారతదేశపు ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్, లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఈరోజు మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ విభాగాన్ని పునర్నిర్వచించటానికి రూపొందించబడిన విప్లవాత్మక స్మార్ట్ఫోన్ అయిన బ్లేజ్ కర్వ్ 5జి ని ప్రవేశపెట్టింది. ఇందులో అపరిమితమైన మల్టీటాస్కింగ్ కొరకు ఈ విభాగపు ఉత్తమమైన 8జిబి ఎల్పిడిడిఆర్ఎస్ RAM, విభాగము మొట్టమొదటి యూఎఫ్ఎస్ 3.1 128జిబి/256జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఈ కలయిక 100% వరకు వేగవంతమైన యాప్ ఓపెనింగ్ రేట్స్ కు దారితీస్తుంది. ఇది మెరుపు-వేగం కలిగిన మీడియాటెక్ డిమెన్సిటి 7050 ప్రాసెసర్ ద్వారా ఆధారితమైనది, అసమానమైన వేగము, సామర్థ్యము అందిస్తుంది. ఈ పరికరము విభాగములో ఉత్తమమైన 570కే+ అంటుటు స్కోర్ పెంచుతుంది, తద్వారా తన ధరల విభాగములో గేమింగ్, యాప్ అనుభవాలను కొత్త ప్రమాణాలను ఏర్పరచింది. బ్లేజ్ కర్వ్ 5జి రూ. 17,999 నుండి ప్రారంభమై భారతీయ వినియోగదారులకు అసాధారణమైన విలువ, పనితీరును అందించుటకు లావా యొక్క నిబద్ధతను సూచిస్తుంది.
వైడ్వైన్ ఎల్1 సపోర్ట్ తో అద్భుతమైన 16.94 cm (6.67″) 120Hz 3D కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లే మరొక విభాగము ఉత్తమమైన విశేషము. ఇది యూజర్లకు లీనమయ్యే విజువల్ అనుభవాలను అందిస్తుంది. దీనిలో ప్రీమియం AG గ్లాస్ బ్యాక్ డిజైన్ ఉంది. ఇది ఎల్ఈడి ఫ్లాష్ తో 8ఎంపి అల్ట్రావైడ్, 2ఎంపి మాక్రోతో ఈఐఎస్ సపోర్ట్ తో 64ఎంపి ప్రైమరీ రియర్ కెమెరా (సోని సెన్సార్) ను పెంచుతుంది. ఇందులో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది పదునైక, స్పష్టమైన సెల్ఫీలు తీయవచ్చు. లావా బ్లేజ్ కర్వ్ 5జి రెండు రంగుల వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. ఐరన్ గ్లాస్, విరిడియన్ గ్లాస్. అంతేకాకుండా, బ్లేజ్ కర్వ్ 5జిలో డాల్బి అట్మోస్ సపోర్ట్ ఉన్న స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఇవి మంచి లీనమయ్యే ఆడీయో నాణ్యతను అందిస్తుంది.
సునీల్ రైనా, మేనేజింగ్ డైరెక్టర్ లావా ఇంటర్నేషనల్ మాట్లాడుతూ.. “బ్లేజ్ కర్వ్ 5జి స్మార్ట్ఫోన్ పరిశ్రమలో భారతదేశపు ఇంజనీరింగ్ శక్తిని ప్రదర్శిస్తుంది. సబ్-20కే ధరల శ్రేణిలో భారతీయ వినియోగదారుల ఆకాంక్షలను పూర్తి చేయుటకు రూపొందించబడిన ఈ బ్లేజ్ సీరీస్ తో మా వినియోగదారులకు ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందించడం మా లక్ష్యము” అని అన్నారు.
ఉన్నతమైన వినియోగదారు అనుభవాన్ని అందించాలనే లావా యొక్క నిబద్ధతకు అనుగుణంగా, బ్లేజ్ కర్వ్ 5జి బ్లోట్వేర్ ఫ్రీ, యాడ్-ఫ్రీ, క్లీన్ ఆండ్రాయిడ్ 13 పై నడుస్తుంది. హామీ ఇవ్వబడిన ఆండ్రాయిడ్ 14, 15 కు అప్గ్రేడ్స్ తో సహా క్రమానుసార సాఫ్ట్వేర్ అప్డేట్స్ ను లావా వాగ్ధానం చేస్తుంది. వీటితో పాటు మూడు సంవత్సరాల వరకు త్రైమాసిక భద్రత అప్డేట్స్ కూడా అందిస్తుంది.
బ్లేజ్ కర్వ్ 5జి లో శక్తివంతమైన 5000 mAh (typ) లి-పాలీమర్ బ్యాటరీ ఉంది. 33డబ్ల్యూ చార్జర్ తో అత్యంత వేగంగా చార్జ్ అవుతూంది. అంతరాయం లేకుండా కొనసాగే వినియోగాన్ని నిర్ధారిస్తుంది.
బ్లేజ్ కర్వ్ 5జి Amazon.in, లావా ఈ-స్టోర్, లావా రీటెయిల్ నెట్వర్క్ పై మార్చ్ 11, మధ్యాహ్నం 12 నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
ఉచిత సేవ @హోమ్
వారెంటీ కాలములో ఏవైనా సమస్యలు తలెత్తితే, సౌకర్యము, మనశ్శాంతి కొరకు, బ్లేజ్ కర్వ్ 5జి యూజర్స్ కొరకు లావా ఉచిత సేవ @హోమ్ అందిస్తుంది.