Monday, January 20, 2025

8జిబి ర్యామ్‌తో లావా ‘స్టార్మ్ 5జి’

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా ఇంటర్నేషనల్ పవర్ హౌస్ ‘స్టార్మ్ 5జి’ని ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ ధర రూ. 11,999గా కంపెనీ నిర్ణయించింది. డిసెంబరు 28 నుండి అమెజాన్, లావా ఈ-స్టోర్లలో ఈ ఫోన్ అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. స్టార్మ్ 5జి మీడియాటెక్ డిమెన్సిటి 6080 ఆధారితమైనది. 4,20,000 మించి యాన్ టుటు స్కోర్‌ను పెంచుతూ శక్తివంతమైన ప్రాసెసర్‌తో అపరిమితమైన గేమింగ్ పనితీరును అందిస్తుంది. 8జిబి ర్యామ్, దీనిని 16జిబి వరకు పెంచుకునే వీలుంది. 128జిబ్ స్టోరేజ్, 120 హెడ్జ్ రెఫ్రెష్ రేట్, 17.22 సెమీ (6.78) ఎఫ్‌హెచ్‌డి+ ఐపిఎస్ డిస్‌ప్లే, 5000 ఎంఎహెచ్ బ్యాటరీ, 33డబ్లు వేగవంతమైన చార్జింగ్‌లు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News