ప్రముఖ ఫోన్ తయారీ కంపెనీ లావా ఓ సరికొత్త ఫోన్ ని రిలీజ్ చేసింది. లావా కంపెనీ లావా యువ 2 5జి పేరిట భారతదేశ మార్కెట్లో విడుదల చేసింది. తాజా బడ్జెట్ 5G హ్యాండ్‌సెట్ ప్రస్తుతం ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంది. కాగా, లావా యివా 5జి మేలో విడుదల అయినా విషయం తెలిసిందే. అయితే, ఇండియన్ మార్కెట్లో లావా యువ 5జి ధర రూ. 9,499గా పేర్కొంది. ఈ ఫోన్ 4GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తోంది. కాగా, ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. హ్యాండ్‌సెట్ ఆన్‌లైన్ లభ్యతను కంపెనీ ఇంకా ధృవీకరించలేదు.
స్పెసిఫికేషన్‌లు
లావా యువ 5జి ఫోన్ 6.67-అంగుళాల HD+ స్క్రీన్‌తో 90Hz రిఫ్రెష్ రేట్, 700 nits ప్రకాశం స్థాయిని కలిగి ఉంది. ఈ ఫోన్ 4GB ర్యామ్ తో జతచేయబడిన Unisoc T760 ప్రాసెసర్‌తో అమర్చబడింది. ర్యామ్ అదనంగా 4GB వరకు విస్తరించవచ్చు. ఇది 128GB UFS 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. కాగా, హ్యాండ్‌సెట్ Android 14లో రన్ అవుతుంది.
ఫోటోగ్రఫీ కోసం.. లావా యువ 5జి డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇందులో AI-సపోర్టెడ్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. ఇక ముందు కెమెరాలో సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది.
ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. లావా యువ 5జి ఫోన్ లో 5,000mAh బ్యాటరీ ఉంది. ఇది USB టైప్-C పోర్ట్ ద్వారా 18W వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. హ్యాండ్‌సెట్‌లో డ్యూయల్ స్టీరియో స్పీకర్ యూనిట్ కూడా ఉంది. ఇక భద్రత కోసం.. ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కలిగి ఉంది.