Wednesday, December 4, 2024

రూ.6,999 కే సరికొత్త మొబైల్..

- Advertisement -
- Advertisement -

లావా యువ 4 ఫోన్ భారతదేశ మార్కెట్లో విడుదల అయింది. దీనిని ఎవరైనా కొనుగోలు చేసే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. ఒకవేళ తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఈ లావా యువ 4 ఫోన్ పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ ఫోన్ గురుంచి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

లావా యువ 4 ఫోన్ 4GB + 64GB వేరియంట్ ప్రారంభ ధర రూ.6,999 గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ గ్లోసీ వైట్, గ్లోసీ పర్పుల్, గ్లోసీ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది. కాగా, దేశంలోని ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా మాత్రమే వినియోగదారులు ఈ ఫోన్‌ను కొనుగోలు చేయగలుగుతారు.

ఈ లావా యువ 4 స్మార్ట్‌ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల HD+ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 4GB RAM, 128G వరకు నిల్వ ఉన్న Unisoc T606 ప్రాసెసర్ ఉంది. కాగా, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత UIతో రన్ అవుతుంది.

ఇక ఫోటోగ్రఫీ కోసం.. ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా అందించారు. సెల్ఫీల కోసం.. ఫోన్ ముందు భాగంలో 8MP కెమెరా కూడా ఉంది. అయితే, ఫోన్‌లోని ఫ్రంట్ కెమెరా హోల్-పంచ్ స్లాట్‌లో ఉంది.

ఇక బ్యాటరీ గురుంచి మాట్లాడుతే..ఈ ఫోన్ 5,000mAh తో 10W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. భద్రత కోసం.. ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News