Monday, December 23, 2024

రాజ్ తరుణ్ మగాడు కాదన్న ప్రచారంపై లావణ్య క్లారిటీ!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజ్ తరుణ్ పై సంయుక్త  చేసిన వీడియోపై లావణ్య స్పందించింది. ‘భలే ఉన్నాడే’ సినిమా ప్రమోషన్ కోసం రాజ్ తరుణ్ కి మేటర్(మగతనం) లేదంటూ రిలీజ్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది.

ఓ సినిమా ప్రమోషన్ కోసం ఇలాంటి వీడియో చేశారంటూ చర్చ జరుగుతోంది. కాగా దీనిపై లావణ్య స్పందించింది. ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ ఆమె మండిపడింది. ఈ వీడియో తెల్లవారుజామునే తన దృష్టికి వచ్చిందని చెప్పింది. అందరూ ఇది నేనే కావాలని చేయించారనుకుంటున్నారు. కానీ నేను మొత్తుకుని చెబుతున్నా, ఇది నేను చేయించింది కాదు. వారిలా మూవీ ప్రమోషన్ కోసం ఇంతలా చేస్తారని కూడా ఊహించలేదు. రాజ్ తరుణ్ కూడా ఇలా చేస్తాడని వాళ్లు చెబితే…ఎలా ఒప్పుకున్నాడో నాకు అర్థం కావడం లేదు. నేను ముందు ఏమనుకున్నానంటే…నా ప్రెగ్నెన్సీ కేసును తప్పుదారి పట్టించడానికే ఇలాంటి వీడియో రిలీజ్ చేశారేమో అనుకున్నాను. కానీ సినిమా ప్రమోషన్ అని తెలిశాక చాలా చండాలం అనిపించిందని లావణ్య పేర్కొంది. ఆ వీడియో చేసిన అమ్మాయి అయినా అసలెలా చేసిందనిపించిందని తెలిపింది. ఏయే పరిస్థితుల్లో తానేమేమి మాట్లాడానో ఇతరులకు తెలియదని స్పష్టం చేసింది. రాజ్ తరుణ్ కి మేటర్ లేదని చెప్పినామె అతడితో సంసారం చేసిందో, లేక కేవలం షూట్ చేసిందో ఆమెకే తెలియాలి అని లావణ్య చెప్పుకొచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News