Friday, December 20, 2024

ఆర్‌జే శేఖర్‌పై జుబ్లీహిల్స్ పిఎస్‌లో కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

ఆర్‌జే శేఖర్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ డిబేట్‌లో పాల్గొన్న తనపై ఆర్‌జే శేఖర్ తనపై దాడి చేశాడని రాజ్‌తరుణ్ ప్రియురాలు లావణ్య జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌లో డిబేట్ జరిగింది. ఈ చర్చలో ఆర్‌జే శేఖర్, లావణ్యపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఆగ్రహానికి గురైన లావణ్య చెప్పుతో శేఖర్‌పై దాడి చేసింది.

అనంతరం లావణ్యపై ఆర్‌జే శేఖర్ భూతులు తిడుతూ దాడి చేశాడు. దీంతో లావణ్య శేఖర్ తన కడుపుపై దాడి చేశాడని, చేతికి గాయం అయిందని ఫిర్యాదులో పేర్కొంది. శేఖర్ భాషాతో తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు శేఖర్‌పై 74,115(2) కింద కేసు నమోదు చేశారు. హీరో రాజ్‌తరుణ్ ప్రేమ పేరుతో మోసం చేశాడని లావణ్య జులై 5వ తేదీన నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. లావణ్య ఆధారాలు సమర్పించడంతో రాజ్‌తరుణ్‌పై కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News