కోకాపేటలోని సినీనటుడు రాజ్‌తరుణ్ ఇంటి వద్ద బుధవారం హైడ్రామా నెలకొంది. తమ కుమారుడి ఇంట్లో ఉంటామని మూసాపేట నుంచి రాజ్‌తరుణ్ తల్లిదండ్రులు రాజేశ్వరి, బసవరాజ్ రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారి తీసింది. తనతో సహజీవనం చేసిన వివాహం చేసుకోకుండా మోసం చేశాడని రాజ్‌తరుణ్‌పై లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదం కొనసాగుతుండగా రాజ్‌తరుణ్ తల్లిదండ్రులు కోకాపేటలోని లావణ్య ఉంటున్న ఇంటికి రావడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. కొంతమందితో కలిసి వచ్చి రావడంతోనే ఇంట్లోని సిసి కెమెరాలు, తదితరాలపై దాడి చేసి ధ్వంసం చేశారు. తర్వాత ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా లావణ్య అడ్డుకుంది. దీంతో లావణ్యతో రాజ్‌తరుణ్ తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు.
ఇళ్లు తమ కుమారుడిదని వారు చెప్పగా, ఇక్కడ ఏ ఇల్లు లేదని లావణ్య రాజ్‌తరుణ్ తల్లిదండ్రులకు బయటికి పంపించింది. తర్వాత నార్సింగి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో లావణ్య ఇంటిపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకుని పిఎస్‌కు తరలించారు. దీంతో రాజ్‌తరుణ్ తల్లిదండ్రులు ఇంటి ఎదుట ఆందోళన చేశారు. ఇంటిని కొనుగోలు చేసినప్పుడు రాజ్‌తరుణ్‌కు రూ.70లక్షలు ఇచ్చానని, రూ.1.5కోట్లకు కొనుగోలు చేశామని, ఇప్పుడు రూ.12కోట్లకు చేరిందని లావణ్య చెప్పింది. 11 ఏళ్లు రాజ్‌తరుణ్ తనతో సహజీవనం చేశాడని, తనను వివాహం చేసుకుంటానని మోసం చేశాడని, తన వద్ద ఉన్న డబ్బులు రాజ్‌తరుణ్‌కు ఇచ్చానని చెప్పింది. రాజ్‌తరుణ్ తల్లిదండ్రులు వచ్చి తన ఇంటిని ధ్వంసం చేశారని, తనను ఈడ్చుకుంటూ వెళ్లి ఇబ్బంది పెట్టారని చెప్పింది.
తమకు సంబంధించిన కేసు కోర్టులో ఉందని అయినా తనపై దౌర్జన్యం చేయటానికి ఇక్కడికి వచ్చారని చెప్పారు. రాజ్‌తరుణ్ తల్లిదండ్రులు కొంతమందితో కలిసి వచ్చి దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. గతంలో తాను రాజ్ తరుణ్ తో కలిసి ఉందామని చెప్పానని కలిసి ఉండడానికి వచ్చినట్లయితే తానెందుకు అడ్డుకుంటానని లావణ్య ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వచ్చిన తర్వాతనే రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లోపలికి రావాలని స్పష్టం చేసింది.