- Advertisement -
హైదరాబాద్: రాజ్ తరుణ్ లేని జీవితం వృధా అని, ఆత్మహత్య చేసుకుంటున్నానని తన లాయర్‌కు సందేశాన్ని పంపింది, వెంటనే అతడు 112 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆమె ఇంటికి వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. రాజ్ తరుణ్ లేని జీవితంలో తాను ఉండలేనని, బతకలేనని, అన్నింటిని కోల్పోయానని, అందరి వల్లే తాను మోసపోయానని ఆమె తెలిపింది. రాజ్ తన తల్లిదండ్రులతోనే మొత్తం మారిపోయాడని, తన చావుకు కూడా వారే కారణమని, తన చావు వారు కోరుకుంటున్నారని, మాల్వీ మల్హోత్ర తన చావు ప్రధాన కారణమని పేర్కొంది. తన కుటుంబం, దిలీప్, సుంకర, మీడియాకు తన క్షమాపణలు అంటూ లావణ్య తన అడ్వోకేట్‌కు సందేశం పంపించారు. హీరో రాజ్‌తరుణ్ తనతో ప్రేమ వ్యవహారం నడిపి తనని మోసం చేశాడని లావణ్య స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -