హైదరాబాద్: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, అతని స్నేహితులడు శేఖర్ బాషా తనని చంపాలని చూస్తున్నారంటూ.. లావణ్య ఆరోపించింది. ఈ క్రమంలో ఆమెకు రక్షణ కల్పించాలని కోరుతూ.. నార్సింగి పోలీస్‌స్టేషన్‌ని ఆశ్రయించింది. శనివారం ఆమె మీడియాతో మాట్లాడతూ.. ఇటీవల తనపై కొందరు దాడి చేశారని పేర్కొంది. అందుకే పోలీసులను ఆశ్రయించానని.. కానీ, ఫిర్యాదు చేసి గంటలు గడుస్తున్నా.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపింది. శుక్రవారం సాయంత్రం కూడా నలుగురు మహిళలను తన ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించినట్లు వెల్లడించింది. ప్రతి నిమిషం ప్రాణ భయంతో బతుకుతున్నానని.. తన ప్రాణం పోయాక తన ఇంట్లోకి ప్రవేశించడానికి వాళ్లని పట్టుకుంటారా.. అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
నాలుగేళ్ల క్రితం తెలిసిన వ్యక్తి నుంచి రాజ్ తరుణ్, తాను కలిసి రూ.55 లక్షలు అప్పు తీసుకున్నామని.. ఈ గొడవల కారణంగా రెండు సంవత్సరాల నుంచి వడ్డీ చెల్లించడం లేదని పేర్కొంది. అప్పు ఇచ్చిన వారు ఫోన్ చేసి డబ్బు తిరిగి ఇవ్వమన్నారని.. వారం రోజుల్లో ఇవ్వని పక్షంలో ఇళ్లు స్వాధీనం చేసుకుంటామని చెప్పారని తెలిపింది. ఒక వేళ రాజ్ తరుణ్ ఆ డబ్బులు చెల్లిస్తే.. ఆ ప్రాపర్టీని అతనికి ఇవ్వొద్దని కోరుతానని.. ఎందుకంటే అందులో తన వాటా కూడా ఉందని చెప్పింది. అయినా కూడా రాజ్ తనతో మాట్లాడటం లేదని.. తనని ఇబ్బంది పెట్టాలని, పరువుకు భంగం కలిగించాలని.. చంపేయాలని చూస్తున్నట్లు పేర్కొంది.