Monday, December 23, 2024

చాలా లక్కీగా ఫీలవుతున్నా

- Advertisement -
- Advertisement -

Lavanya Tripathi about Happy Birthday

స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో రితేష్ రానా దర్శకత్వంలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన సర్రియల్ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘హ్యాపీ బర్త్ డే’. ఈనెల 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది ఈ చిత్రం. ఈ నేపథ్యంలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి మీడియాతో మాట్లాడుతూ “ఈ సినిమాలో మొదటి సారి గన్ పట్టుకోవడం కొత్తగా అనిపించింది. జోనర్, కథ, కథనం అన్నీ కొత్తగా వుంటాయి. సినిమా అద్భుతంగా వచ్చింది. నేను సహజంగానే జిమ్, బాక్సింగ్ చేస్తాను. కానీ మొదటిసారి స్క్రీన్‌పై యాక్షన్ చూపించే అవకాశం ‘హ్యాపీ బర్త్ డే’తో దక్కింది. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుంది. ఇందులో హ్యాపీ అనే పాత్ర చేశాను. నా పాత్ర కథలో కీలకంగా వుంటుంది. హ్యాపీ పాత్ర చేయడం చాలా ఈజీగా అనిపించింది. పాత్రలో చాలా ఫన్ వుంది. ఇందులో ఫోర్స్ కామెడీ వుండదు. ‘హ్యాపీ బర్త్ డే’ అందరినీ నవ్విస్తుంది. ఫీమేల్ ఓరియెంటెడ్ అనగానే చాలా సీరియస్‌గా వుండే పాత్రలే వస్తుంటాయి. కానీ ఇలాంటి ఎంటర్‌టైనర్‌లో లీడ్ రోల్ రావడం ఆనందంగా ఉంది. రితేష్ రానా నన్ను ఒక ఇంటర్వ్యూలో చూసి హ్యాపీ పాత్రని రాశారు. ఈ విషయంలో చాలా లక్కీగా ఫీలవుతున్నా. ప్రస్తుతం తమిళ్‌లో అథర్వతో ఓ సినిమా చేస్తున్నా. ఇది దాదాపుగా పూర్తయింది”అని అన్నారు.

Lavanya Tripathi about Happy Birthday

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News