Wednesday, January 22, 2025

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం?

- Advertisement -
- Advertisement -

ప్రముఖ టాలీవుడ్ నటుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి చాలా సంవత్సరాలుగా రిలేషన్‌షిప్‌లో ఉండి, ఇప్పుడు వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలోస్తున్నాయి. అయినప్పటికీ వారిద్దరూ ఎప్పుడూ మంచి స్నేహితులమని పేర్కొన్నారు. ఈ జంట జూన్ 9న నిశ్చితార్థం చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత పెళ్లి జరుగుతుందని, అయితే తేదీని నిర్ణయించలేదని సన్నిహితులు చెప్పినట్లు పలు మీడియా సంస్థలు తెలిపాయి.

నిశ్చితార్థం ఇంట్లో లేదా హైదరాబాద్‌లోని ఒక వేదికలో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరుగుతోందని టాక్ వినిపిస్తోంది. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ప్రస్తుతం దేశంలో లేరు. జూన్ 1 చివర్లో హైదరాబాద్‌కు తిరిగి రానున్నట్లు సమాచారం. వీరు ఇద్దరు కలిసి ‘మిస్టర్, అంతరిక్షం’ సినిమాల్లో కలిసి నటించారు. ప్రస్తుతం ఈ న్యూస్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News