Tuesday, December 24, 2024

లావణ్య పోల్ డ్యాన్స్.. ఆసక్తిగా ‘హ్యాప్తీ బర్త్‌డే’ టీజర్

- Advertisement -
- Advertisement -

‘మత్తువదలరా’ చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న రితేష్‌రానా దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘హ్యాప్తీ బర్త్‌డే’. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ సంస్థతో కలిసి నిర్మిస్తోంది. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఈనెల 15న విడుదల కానుంది. ఈ చిత్రబృందం మంగళవారం చిత్రం టీజర్‌ను విడుదల చేసింది. వినూత్నంగా, పూర్తి కామెడీ ప్రధానంగా వున్న ఈ టీజర్ అందరిని ఆకట్టుకుంటోంది. కేంద్ర మంత్రి పాత్రలో వెన్నెల కిషోర్ సంభాషణలు, గన్‌బిల్లును ఆమోదించడం, ఇంటికొక గన్ పాలసీని ప్రతిపాదించడం, లావణ్య త్రిపాఠి పోల్ డ్యాన్స్, సత్య స్టయిలిష్ వాక్ వంటి సన్నివేశాలు టీజర్‌లో ఎంతో వినోదాత్మకంగా కనిపించి చిత్రంపై అంచనాలు పెంచాయి.

Lavanya Tripathi ‘Happy Birthday’ movie teaser out

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News