Monday, December 23, 2024

నాకు ఎలాంటి కండీషన్స్ లేవు.. సినిమాల్లో నటిస్తా: లావణ్య త్రిపాఠి

- Advertisement -
- Advertisement -

పెళ్లి తర్వాత మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. నటనపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే లావణ్య.. మిస్ ఫర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ లో నటించారు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లావణ్య మాట్లాడుతూ.. అవకాశాలు వస్తే.. వెబ్ సిరీస్ లతోపాటు సినిమాల్లోనూ నటిస్తానని తెలిపింది. ఈ విషయంలో తనకు వరుణ్ తేజ్ గాని, మా కుటుంబం గాని ఎలాంటి కండీషన్స్ పెట్టలేదని చెప్పింది. కానీ, పెళ్లి చేసుకున్న తర్వాత మెగా కోడలిగా తనకు బాధ్యతలు పెరిగాయని.. తకంటూ కొన్ని హద్దులున్నాయిన తెలిపింది. తన హద్దులేంటో తనకు తెలుసని.. వాటిని దాటకుండా.. మంచి అవకాశాలు వస్తే మూవీల్లోనూ నటించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేసింది ఈ సొట్ట బుగ్గల సుందరి.

కాగా, మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ త్వరలోనే హార్ట్ స్టార్ లో ప్రసారం కానుంది. ఇందులో లావణ్యతోపాటు బిగ్ బాస్ ఫేం అభిజిత్, నటి అభిగ్న తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News