Monday, December 23, 2024

నాకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంది:లావణ్య త్రిపాఠీ

- Advertisement -
- Advertisement -

అందాల తార లావణ్య త్రిపాఠీ, హీరో వరుణ్‌తేజ్‌లు ప్రేమించుకొని ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత తన జీవితం ఎంతో హ్యాపీగా ఉందని పేర్కొంది లావణ్య. తాజాగా ఈ బ్యూటీ మాట్లాడుతూ “-వరుణ్ తేజ్‌తో పెళ్లి తర్వాత కెరీర్ పరంగా ఏమీ మారలేదు. మెగా కుటుంబంలోకి వచ్చాక నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి అని నాకు ఎవరూ చెప్పడం లేదు. కెరీర్ పరంగా నాకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంది. వరుణ్ లాంటి అర్థం చేసుకునే లైఫ్ పార్టనర్ ఉన్నాడు. మిగతా వాళ్లు నన్ను చూసే విధానంలో తేడా ఉందేమో. మా వరకు గతంలోలాగే ఉన్నాం.

ఒక పెద్ద ఫ్యామిలీలోకి అడుగుపెట్టడం గుడ్ ఫీలింగ్ ఇచ్చింది.వరుణ్, నేను ఎవరి ప్రొఫెషనల్ వర్క్‌తో వాళ్లం ముందుకు వెళ్తాం. నేను చేసే ప్రాజెక్ట్‌లో తను జోక్యం చేసుకోడు. నేను ఎప్పుడైనా ఎంపిక చేసుకున్న స్క్రిప్ట్ గురించి చెబితే వింటాడు. నా నేటివ్ ప్లేస్ అయోధ్య. అక్కడ శ్రీరామ మందిరం కట్టడం గొప్ప విషయంగా భావిస్తాను. శ్రీరాముడు అయోధ్య మందిరానికి తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇక కొత్త హీరోతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో ఓ సినిమా పూర్తి చేశాను. అందులో పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తా. ఒక తమిళ్ మూవీ కూడా చేస్తున్నా”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News