Wednesday, April 2, 2025

మెదక్‌లో శాంతిభద్రతలు విఫలం కావడం సిగ్గుచేటు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కెసిఆర్ అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ ప్రశాంతంగా ఉందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాంతిభద్రతల విషయంలో విఫలమైందని, మెదక్‌లో శాంతిభద్రతలు విఫలం కావడం సిగ్గుచేటు అని కెటిఆర్ తన ట్విట్టర్‌లో మండిపడ్డారు. మెదక్ జిల్లా కేంద్రంలో బిజెపి బంద్ కొనసాగుతోంది. గోవుల తరలింపు, జంతువధపై ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిజెపి నేతలు మెదక్ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో మెదక్ పట్టణంలో వర్తక, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News