మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో న్యాయ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్, పిజిలాసెట్ దరఖాస్తు గడువును పొడిగించారు. ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 16 వరకు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని లాసెట్ కన్వీనర్ జి.బి.రెడ్డి తెలిపారు. ఆలస్య రుసుం లేకుండా సోమవారంతో గడువు ముగియగా, మరో 10 రోజుల పాటు దరఖాస్తు గడువును పొడిగించినట్లు పేర్కొన్నారు. మరోసారి ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని, తద్వారా వారికి ఎంపిక చేసుకున్న పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయడానికి అవకాశం లభిస్తుందని అన్నారు. జులై 21,22 తేదీలలో లాసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. లాసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బి కోర్సులైన బిఎ ఎల్‌ఎల్‌బీ, బిబిఎ ఎల్‌ఎల్‌బీ, బీ.కాం ఎల్‌ఎల్‌బీ, రెండేండ్ల పీజీ లా కోర్సులైన ఎల్‌ఎల్‌ఎంలో ప్రవేశాలు కల్పిస్తారు.