Wednesday, December 25, 2024

సరిహద్దుల ఆంక్షలు లేకుండా సాగాలి:అమిత్ షా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : చట్టపరిరక్షణ సంస్థలు ఎటువంటి పరిస్థితుల్లో అయినా తమ పనితాము చేసుకుంటూ వెళ్లాలి. సరిహద్దులకు ఆవల నేరస్తులు ఉన్నారని, విధి నిర్వహణలో ఇది ఆటంకం అని భావించుకోరాదని స్పష్టం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నేరాలకు అక్రమాలకు దిగేవారు భౌగోళికపరమైన సరిహద్దులను పాటించరు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు. ఇటువంటి వారి ఆటకట్టించేందుకు, తిరిగి దుశ్చర్యలు జరగకుండా చేసేందుకు అనివార్యంగా చట్టపరమైన సంస్థలు కరకుగానే వ్యవహరించాల్సి ఉంటుంది. సరిహద్దులు, ఆంక్షలను తమకు ప్రతిబంధకం అనుకోరాదని, నిజానికి వీటిని అంతర్జాతీయ స్ఖాయి నేరాల నియంత్రణకు అనువుగా నిలిచే సందర్భాలని భావించుకోవల్సి ఉంటుందని అన్నారు. కామన్‌వెల్తు లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ ( క్లియా), కామన్‌వెల్తు అటార్నీ , సొలిసిటర్ జనరల్ కాన్ఫరెన్స్‌ను ఉద్ధేశించి ఆయన ఆదివారం ప్రసంగించారు.

అంతర్జాతీయ స్థాయి నేరాల అదుపునకు పలు దేశాల భద్రతా సంస్థలు, చట్టపరిరక్షణా సంస్థల మధ్య సరైన సమన్వయం అవసరం అని తెలిపారు. ఎప్పుడైతే చట్టసంస్థలకు పరిమితులు ఉంటాయో అప్పుడు నేరస్తులు తప్పించుకోవడానికి, చట్టానికి చిక్కకుండా వెళ్లేందుకు మార్గం మనమే చూపినట్లు అవుతుందని తెలిపారు. వాణిజ్య అక్రమాలు, నేరాలు దేశాల సరిహద్దులు దాటుకుని విస్తరించుకుని పోతున్న దశలో సంబంధిత అంతర్జాతీయ సదస్సు ద్వారా సరైన సందేశం వెలువడుతుందని తాను విశ్వసిస్తున్నట్లు హోం మంత్రి తెలిపారు. న్యాయం చట్టం అమలుకు ఎటువంటి సరిహద్దుల ఆంక్షలు ఉండరాదని సూచించారు. అయితే వీటి విషయంలో ఇప్పుడు పలు సవాళ్లు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News