Sunday, January 19, 2025

బాల్య వివాహాల నిరోధక చట్టం అమలుకు వ్యక్తిగత చట్టాలు అడ్డంకి కారాదు

- Advertisement -
- Advertisement -

బాల్య వివాహాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బాల్య వివాహాల చట్టం అమలుకు వ్యక్తిగత చట్టాలు అడ్డంకి కారాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. దేశంలో బాల్య వివాహాల నిరోధక చట్టం (పిసిఎంఎ)ను సమర్థంగా అమలు చేసేందుకు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ)డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్దీవాలా, మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం శుక్రవారం మార్గదర్శకాలు జారీ చేసింది. బాల్యంలో వివాహం చేస్తే జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛను హరించినట్లే అవుతుందని ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. బాల్య వివాహాలు, మైనర్ల రక్షణపై అధికారులు దృష్టి సారించాలని బెంచ్ సూచించింది. నేరస్థులకు జరిమానా విధించాలని బెంచ్ ఆదేశించింది. వ్యక్తిగత చట్టాలతో బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని అడ్డుకోరాదని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

వ్యక్తిగత చట్టాలపై పిసిఎంఎది పైచేయి అవుతుందా లేదా అన్న అంశం పార్లమెంట్ ముందు పరిశీలన నిమిత్తంపెండింగ్‌లో ఉందని బెంచ్ తెలియజేసింది. వ్యక్తిగత చట్టాలపై పిసిఎంఎదే అధిపత్యం అవుతుందని చెప్పవలసిందిగా సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రం విజ్ఞప్తి చేసింది. తీర్పులో ‘ఎంతో విస్తృతంగా’ సామాజికపరమైన విశ్లేషణ జరిపినట్లు సిజెఐ ప్రధానంగా ప్రస్తావించారు. ‘బాల్య వివాహాలను నిషేధించాలని పిసిఎంఎ కోరుతున్నది. కానీ, బాల్యంలోనే నిర్ధారించే వివాహాల భారీ సామాజిక చెడుగును అది అడ్డుకోవడం లేదు.న అది ఎంపిక చేసుకునే హక్కులను ఉల్లంఘిస్తోంది& జీవిత భాగస్వామిని, మైనారిటీ తీరక ముందే తమ జీవిత పంథాను ఎంచుకునే వారి హక్కును అది పరిహరిస్తోంది’ అని సిజెఐ అన్నారు. అయితే, చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడేవారి ప్రాసిక్యూషన్‌ను నిరుత్సాహపరచరాదన్నట్లుగా అర్థం చేసుకోరాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

చట్టం అమలు యంత్రాంగం బాల్య వివాహాల నిరోధానికి, నిషేధానికి శక్తివంచన లేకుండా కృషి చేయవలసి ఉంటుందని, ప్రాసిక్యూషన్‌పైనే దృష్టి కేంద్రీకరించరాదని బెంచ్ అభిప్రాయం వ్యక్తం చేసింది. బాల్య వివాహాల నిరోధానికి చట్టాన్ని సమర్థంగా అమలు పరచాలని కోరుతూ చైతన్యం, స్వచ్ఛంద కార్యాచరణ సంఘం (ఎస్‌ఇవిఎ) దాఖలు చేసిన పిల్‌పై సుప్రీం కోర్టు ఈ తీర్పు వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News