Wednesday, April 2, 2025

మీరట్‌లో లా విద్యార్థి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

Law student brutally murdered in Meerut

హంతకుల అరెస్టు హతుడికి గే లింక్‌లు

మీరట్ : ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో 21 ఏండ్ల లా విద్యార్థి యష్ రస్తోగిని దారుణంగా హత్య చేశారు. రస్తోగిని చంపి , శవాన్ని ఓ గోనెసంచిలో పెట్టి ఓ కాలువలో పడేశారు. గత నెల 27 నుంచి ఈ లా విద్యార్థి జాడ తెలియకుండా పోయింది. గాలింపు జరపగా గోనెసంచిలో కాలువలో పడి ఉన్న భౌతికకాయం కనుగొన్నామని, దర్యాప్తు క్రమంలో యష్ రస్తోగి శవం అని తేలిందని పోలీసులు తెలిపారు. ఈ దారుణ హత్యకు సంబంధించి షవేజ్, ఇమ్రాన్, సల్మాన్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారిని నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదుఅయిందని వివరించారు. మృతుడు గే అని, హంతకులలో ఒకరిని కొన్ని ఫోటోలు చూపి, డబ్బులు వసూలు చేస్తూ బ్లాక్‌మొయిల్‌కు దిగినందునే హత్య జరిగినట్లు వెల్లడయిందని మీరట్ ఎస్‌పి సునీల్ భట్నాగర్ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News