మన తెలంగాణ/సిటీ బ్యూరో : లా కాలేజీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ఇవ్వడం ద్వారా న్యాయవాదిగా కేసుల వ్యవహారంపై పూర్తిగా అవగాహన కల్పించడం రావడంతో భవిష్యత్తులో వారు న్యాయవాదులుగా రాణించేందుకు ఎంతోఉపయోగపడనుందని జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. మంగళవారం మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ వద్ద ఇంటర్న్ షిప్ పొందిన లా విద్యార్థులకు ఆయన సర్టిఫికెట్‌లను ప్రధానం చేశారు. సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ఇవ్వడం ద్వారా న్యాయవాదిగా కేసుల వ్యవహారం పై పూర్తిగా అవగాహన కల్పించడం తో భవిష్యత్తులో వారు న్యాయ వాదులుగా ఎదిగేందుకు అనుభవం వస్తుందన్నారు.
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల లా కాలేజీ ఎల్బీనగర్ కు చెందిన 18 మంది విద్యార్థులు, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజ్ సంగారెడ్డి కి చెందిన 8మంది విద్యార్థులకు కమిషనర్ రోనాల్ రోస్ మున్సిపల్ స్టాండింగ్ ఇంటర్న్ షిప్ అవకాశం కల్పించినట్లు తెలిపారు. పేద విద్యార్థులకు కొందరికి హైకోర్టు, డిస్ట్రిక్ట్ సివిల్ కోర్టులలో స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా ఇంటర్ షిప్ కల్పించడం జరిగిందనన్నారు.
స్టాండింగ్ కౌన్సిల్ చక్కగా అవగాహన కల్పించారు : లా విద్యార్థులు
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ న్యాయ విద్యార్థులు గా మాకు కోర్టులో ఎలా వ్యవహరించాలి, కేసుల గురించి స్టాండింగ్ కౌన్సిల్ చక్కగా అవగాహన కల్పించారని లా విదార్థులు తెలిపారు. ఈ సందర్భంగా ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పించినందుకు కమిషనర్ కు కృతజ్ఞతలు తెలిపారు. సర్టిఫికెట్ ప్రధానం కార్యక్రమంలో ఎల్‌బినగర్ లా కాలేజ్ ప్రిన్సిపల్ మానస, సంగారెడ్డి లా కళాశాల ప్రిన్సిపల్ గీత, సోషల్ వెల్ఫేర్ గురుకుల శాఖ ఓ.ఎస్.డి హరిత, అడిషనల్ కమిషనర్ కోట శ్రీవాత్సవ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్, ఏం.ఎం.సి కపూర్ తదితరులు పాల్గొన్నారు.