Tuesday, November 5, 2024

లా విద్యార్థుల గ్రామీణ సేవలు మెడికోల వలెనే తప్పనిసరి: జస్టిస్‌లలిత్

- Advertisement -
- Advertisement -

Law students have to go to court at taluka level

న్యూఢిల్లీ : న్యాయ శాస్త్ర విద్యార్థులు తాలూకా స్థాయిలో న్యాయసాయానికి వెళ్లాల్సి ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి యుయు లలిత్ శనివారం ఉద్భోధించారు. వైద్యశాస్త్ర విద్యార్థులు మాదిరిగానే న్యాయ విద్యార్థులకు కూడా గ్రామీణ ప్రాంతాలలో సేవలు తప్పనిసరి చేయాల్సి ఉంది. ఇప్పుడు ఎంబిబిఎస్ పూర్తి దశలో విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలలో ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. ఇది తప్పనిసరి నిబంధనగా ఉంది. గ్రామీణ ప్రాంతాలలో సామాన్యుడికి న్యాయం చట్టం గురించి అవగావహన కల్పిస్తూ వారికి పూర్తిస్థాయిలో న్యాయ సాయం అందించేందుకు విద్యార్థులు ముందుకు రావల్సి ఉందని పిలుపు నిచ్చారు.

అరెస్టులకు ముందు అందాల్సిన న్యాయం అరెస్టులు రిమాండ్ దశలో పరిస్థితి అనే అంశంపై ఇక్కడ జరిగిన సమావేశంలో జస్టిస్ లలిత్ శనివారం మాట్లాడారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, లా స్టూడెంట్స్ అంతా కూడా గ్రామీణ ప్రజలకు న్యాయసాయం గురించి తెలియచేయాల్సిన బాధ్యతను తీసుకోవాలని కోరారు. ప్రత్యేకించి ఎల్‌ఎల్‌బి ముగింపు దశలో విద్యార్థులు నిర్ణీత సమయం వరకూ గ్రామీణ ప్రాంతాలలో న్యాయవాద వృత్తికి వెళ్లాల్సి ఉందని, దీనిని కోర్సులో డిగ్రీకి ముందు తప్పనిసరి నిబంధన చేయాలని తెలిపారు. ఈ అంశంపై తాను ఇప్పటికే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో సంప్రదింపులు జరిపినట్లు వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News