Wednesday, January 22, 2025

అల్లుడిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన అత్తింటి వారు

- Advertisement -
- Advertisement -

లక్నో: దంపతుల మధ్య గొడవలు జరగడంతో పుట్టింటికి వెళ్లిన భార్యను తీసుకరావడానికి వెళ్లినప్పుడు భర్తపై అత్తింటి వారు పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 2019 నవంబర్ 8న ప్రీతి, ధర్మేంద్రకు పెళ్లి జరిగింది. వివాహం జరిగినప్పటి నుంచి కూడా అతడితో ఆమె స్నేహంగా ఉండలేదు. మూడు నెలల క్రితం భర్తతో గొడవ పడి భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. జులై 18న తన భార్యను తీసుకరావడానికి ధర్మేంద్ర తన అత్తగారింటికి వెళ్లాడు. దీంతో అత్తింటి వారు అతడితో గొడవపడ్డారు. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో ప్రీతి తల్లి శిల్ప, సోదరుడు అజయ్ సింగ్, ప్రీతి కలిసి ధర్మేంద్రపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. అతడు కేకలు వేయడంతో స్థానికులు మంటలను ఆర్పి ఆస్పత్రికి తరలించారు. ధర్మేంద్ర సోదరుడు లోకేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: కర్నూల్‌లో భర్త నాలుక కొరికిన భార్య… తీవ్ర రక్తస్రావం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News