Wednesday, January 22, 2025

పరువునష్టం కేసులో రాహుల్‌కు నాసిక్ కోర్టు సమన్లు

- Advertisement -
- Advertisement -

సావర్కార్‌పై వ్యాఖ్యలకు రాహుల్‌పై దావా
ముంబయి : హిందుత్వ సిద్ధాంతకర్త వినాయక్ దామోదర్ సావర్కార్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీపై దాఖలైన పరువునష్టం దావాలో ఆయనకు మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో ఒక కోర్టు సమన్లు జారీ చేసింది. ‘దేశ భక్తునిపై చేసిన ప్రకటన ప్రాథమికంగా పరువునష్టం కలిగించేదిగా కనిపిస్తోందని నాసిక్ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దీపాలి పరిమళ్ కదుస్కర్ సెప్టెంబర్ 27న రాహుల్ గాంధీపై ఒక ప్రాసెస్ (సమన్లు/ నోటీస్) జారీ చేశారు.

కేసు తదుపరి విచారణ తేదీన రాహుల్ స్వయంగా లేదా తన న్యాయవాది ప్రతినిధి ద్వారా హాజరు కావలసి ఉంటుంది. విచారణ తేదీని ఇంకా నిర్ణయించవలసి ఉంది. రాహుల్ గాంధీ రెండు సందర్భాల్లో తన మాటలు, దృశ్యాల ద్వారా వీర్ సావర్కార్ ప్రతిష్ఠకు ఉద్దేశపూర్వకంగా హాని కలిగించానని, సమాజంలో ఆయన ప్రతిష్ఠను దిగజార్చడానికి ప్రయత్నించారని ఫిర్యాదీ ఒక ఎన్‌జిఒ డైరెక్టర్ ఆరోపించారు. ‘సావర్కార్ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ భూతం’ అని అన్నారని, అది పరువునష్టం కలిగించే వ్యాఖ్య అని ఫిర్యాదీ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News