- Advertisement -
హైదరాబాద్: కోర్టులో వాదనలు వినిస్తూ.. న్యాయవాది మృతి చెందిన విషాద ఘటన తెలంగాణ హైకోర్టులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వేణుగోపాల్ రావు అనే న్యాయవాది 21 కోర్టు హాలులో వాదనలు వినిపిస్తు.. అకస్మత్తుగా కుప్పకూలిపోయారు. ఇది గమనించిన తోటి లాయర్లు ఆయన్ని ఆంబులెన్స్‌లో ఉస్మానియా ఆస్పత్రికి తరలిచారు. కానీ, అప్పటికే వేణుగోపాల్ రావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కోర్టు ఆవరణలో విషాదఛాయలు అలుముకున్నాయి. వేణుగోపాల్ రావు మృతికి సంతాపంగా 21వ కోర్టులో పిటిషన్ల విచారణను, మిగితా కోర్టుల్లో అత్యవసర, పాస్ ఓవర్ పిటిషన్లను విచారించి.. రెగ్యులర్ పిటిషన్లను వాయిదా వేశారు.
- Advertisement -