Sunday, December 22, 2024

ములుగులో న్యాయవాదిని నడిరోడ్డుపై కత్తులతో పొడిచి….

- Advertisement -
- Advertisement -

Lawyer murder in Mulugu

ములుగు: న్యాయవాదిని నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపిన సంఘటన ములుగు జిల్లా పందికుంట బస్ స్టేజీ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డికి (58) భూవివాదాలు ఉన్నాయి. సోమవారం భూసమస్యపై అధికారులతో మాట్లాడానికి కలెక్టర్ కార్యాలయానికి వచ్చాడు. మల్లారెడ్డి తిరిగి హనుమకొండకు వెళ్తుండగా పంది కుంట బస్ స్టేజీ సమీపంలో స్పీడ్ బ్రేకర్ వద్ద అతడి కారును మరో కారు ఢీకొట్టింది.

వెంటనే కారులో నుంచి దిగి ఎందుకు ఢీకొట్టారని అడిగారు. క్షమించాలని డ్రైవర్ కోరడంతో తన కారు వద్దకు వెళ్లి డోర్ తీయబోతుండగా అతడిని నలుగురు పట్టుకున్నారు. సమీపంలో పొదల్లోకి లాక్కెళ్లి కత్తులతో పొడిచి చంపారు. ఈ హత్య జరుగుతున్నప్పుడు మల్లారెడ్డి కారు డ్రైవర్ ను ఇద్దరు వ్యక్తులు కదలకుండా పట్టుకున్నారు. వెంటనే నిందితులు కారులో పారిపోయారు. వాహనదారుల సమాచారం మేరకు ఎస్‌పి సంగ్రామ్ సింగ్, జి పాటిల్, ఎఎస్‌పి సుధీర్‌ రాంనాథ్ కేకన్, ఎస్‌ఐ ఓంకార్ యాదవ్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వెల్లడించారు. భూతగాదాలతో ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News