Wednesday, January 22, 2025

దేశ రాజధానిలో పట్టపగలు లాయర్ దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో సీమ తరహా వంశవైరం
పట్టపగలు ఓ లాయర్ దారుణ హత్య
1987 ఘటనకు ఇప్పటి ప్రతీకారం
నేడు విధులను బహిష్కరించే న్యాయవాదులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ లాయర్‌ను నడిరోడ్డుపై కాల్చి చంపారు. న్యాయవాది వీరేందర్ కుమార్ నర్వాలిని బైక్‌పై వచ్చిన దుండగులు శనివారం పగలు స్థానిక ద్వారకా ప్రాంతంలో అడ్డగించి రివాల్వర్‌తో కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ లాయర్‌ను చంపిన ఇద్దరిని నరేష్, ప్రదీప్‌లుగా గుర్తించారు. లాయర్‌కు ప్రదీప్‌తో 36 ఏండ్లుగా శత్రుత్వం ఉందని వెల్లడైంది. 1987లో ప్రదీప్ మేనమామను లాయర్ తాత చంపినట్లు, దీనితో ఇరు కుటుంబాల మధ్య వైరం రగులుతూ వచ్చిందని వెల్లడైంది. పైగా ప్రదీప్‌కు రావల్సిన కొంత భూమి పరిహారాన్ని రాకుండా చేసేందుకు నర్వాల్ లాయర్‌గా తన పావులు కదిపినట్లు, దీనితో లాయర్‌పై ప్రదీప్ మరింతగా కక్ష పెంచుకున్నట్లు వెల్లడైంది.

తనకు రావల్సిన పరిహారం రాకపోవడంతో వృత్తిరీత్యా కుస్తీయోధుడు అయిన ప్రదీప్ ఈ లాయర్‌ను అంతమొందించాలని అవకాశం కోసం చూస్తూ వచ్చినట్లు, 2017లో కూడా ఓ సారి నర్వాల్‌ను చంపేందుకు యత్నించినా ఆయన తప్పించుకున్నట్లు, ఆయన లాయర్‌కు గాయాలు అయినట్లు పోలీసుల విచారణ క్రమంలో వెల్లడైంది. వీరేంద్ర కుమార్‌కు పోలీసు భద్రత కల్పించారు. అయితే కోవిడ్ మహమ్మారి దశలో దీనిని వెనకకు తీసుకున్నారు.

ఇప్పుడు అవకాశం చూసుకుని ప్రదీప్ తన పగ తీర్చుకున్నట్లు వెల్లడైంది. జరిగిన ఘటనపై ఢిల్లీలోని లాయర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది మొత్తం న్యాయవాద వృత్తిపైనే జరిగిన దాడిగా తెలిపారు. తోటి లాయర్ దారుణ హత్యకు నిరసనగా ఢిల్లీ లాయర్లు సోమవారం అన్ని కోర్టులలో విధులను బహిష్కరిస్తారు. ఈ మేరకు ఢిల్లీ బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. కోర్టులలో అన్ని కార్యకలాపాలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News