Sunday, January 19, 2025

ఆ ఎమ్మెల్యే పిఎతో ప్రాణహాని… హైకోర్టు ముందు మహిళా న్యాయవాది నిరసన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ పిఎతో తనకు ప్రాణహాని ఉందని ఓ న్యాయవాది హైకోర్టు నిరసన తెలిపింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ పిఎ గడ్డం ప్రసాద్‌ తనని చంపేస్తానని బెదిరిస్తున్నాడని బెల్లంపల్లికి చెందిన న్యాయవాది, నాలుగు నెలల గర్భిణి గడవీణ మమత తెలంగాణ హైకోర్టు ఎదుట తన మూడేళ్ల పాపతో నిరసన తెలిపింది. బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీకి చెందిన చిప్పరి విక్టోరియా అనే మహిళ భర్త ఉండగానే ఒంటరి మహిళా పెన్షన్ తీసుకుంటుంది. దీంతో న్యాయవాది మమత కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి విక్టోరియా కుటుంబ సభ్యులు మమతపై పగ పెంచుకొని తనపై దాడి చేశారని తెలిపారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ పిఎ గడ్డం ప్రసాద్ బెల్లంపల్లిలో తిరగనివ్వనని, చంపేస్తానని ఫోన్‌లో బెదిరిస్తున్నట్లు మమత వాపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News