Thursday, December 19, 2024

ఢిల్లీ తీస్ హజారీ కోర్టు వద్ద న్యాయవాదుల ఘర్షణ: గాలిలోకి కాల్పులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు వద్ద రెండు వర్గాలకు చెందిన న్యాయవాదులు ఘర్షణపడి కాల్పులకు తెగబడ్డారు. అయితే ఈ ఘనటలో ఎవరూ గాయపడలేదు. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో న్యాయవాదులు కాల్పులు జరుపుకోగా పోలీసులు కోర్టు వద్దకు పరుగులు తీసినట్లు పోలీసు అదికారి ఒకరు వెల్లడించారు.

తీస్ హజారీ కోర్టు వద్ద తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధానికి దిగిన రెండు వర్గాలకు చెందిన న్యాయవాదులు గాలిలో కాల్పులు జరిపారని, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని డిసిపి(నార్త్) సాగర్ సింగ్ కల్సీ తెలిపారు.

ఢిల్లీలో ఏడు జిల్లా కోర్టులు ఉన్నాయి. తీస్ హజారీ, రోహిణి, సాకేత్, ద్వారక, కర్కర్‌దూమ, రూస్ అవెన్యూ, పాటియాలా హౌస్ కోర్టుతోపాటు ప్రధాన ఢిల్లీ హైకోర్టు ఉన్నాయి. జిల్లా కోర్టులలో పోలిస్తే హైకోర్టు వద్ద భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉంటాయి.

తీస్ హజారీ కోర్టు వద్ద న్యాయవాదులు ఘర్షణ పడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో దర్ణనమిస్తున్నాయి. న్యాయవాదులు పరస్పరం దూషించుకోవడం, ఒక న్యాయవాది గాలిలో కాల్పులు జరపడం వంటి దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. మరో వీడియలో కొందరు న్యాయవాదులు పరస్పరం రాళ్లు రువ్వుకోవడం, ఇనుప రాడ్లతో దాడి చేసుకోవడం కూడా కనిపించింది.

ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉందని, న్యాయవాదులపై చట్టపరమైన చర్యలు చేపట్టామని డిసిపి తెలిపారు. సిటీ కోర్టులో కాల్పుల సంఘటన జరగడం ఇదే ప్రథమం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News