Monday, January 20, 2025

న్యాయానికి సంకెళ్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతకు ముప్పు వాటిల్లిందని పేర్కొంటూ 600 మందికి పై గా న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈ లాయర్లు తమ సంతకాలతో దేశ ప్రధా న న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌కు గురువారం లేఖ పంపించారు. దేశంలో పేరుమోసిన న్యాయవాదులు హరీశ్ సాల్వే, పింకీ ఆనంద్, బార్ కౌ న్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మనన్‌కుమార్ మిశ్రా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు అ దిష్ సిఅగర్‌వాల్, హితేష్ జైన్, ఉజ్వల్ వార్ సహా లాయర్ల బృందం లేఖ పంపించింది. దేశంలోని రాజకీయ వ్యవస్థకు చెందిన కొన్ని శక్తులు ఏదో విధంగా తమ స్వార్థపూరిత అజెండాను అ మలుపర్చుకుని తీరాలని యత్నిస్తున్నాయి. లోక్‌స భ ఎ న్నికల దశలో , పలు కీలక కేసులలో తీర్పులు వె లువడుతున్న నేపథ్యంలో న్యాయవాదులు ఈ వి ధంగా న్యాయవ్యవస్థ ఇప్పుడు ప్రమాదంలో పడిందనే పరోక్ష ప్రమాద ఘంటికలను వెలువరించ డం, సామూహికంగా తమ ఆందోళనను వ్యక్తం చే యడం న్యాయవ్యవస్థలో, రాజకీయ రంగంలో తీవ్ర ప్రకంపనలకు దారితీసింది. సామాజిక కోణంలోనూ దీని ప్రభావం పడింది. దేశంలోని న్యాయవ్యవస్థపట్ల జనం అపార విశ్వాసం అత్యంతకీలకం.

ఇది న్యాయవ్యవస్థకు ప్రాతిపదికగా ఉంటుంది. అయితే కొన్ని రాజకీయ స్వార్థపర శక్తులు తాము చేసిన ఆగడాలను సాగించుకునేందుకు, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ఏకంగా న్యాయవ్యవస్థపై దాడికి దిగుతున్నారు. ఇప్పుడున్న సామాజిక మాధ్యమాలు ఇతరత్రా ప్రచార వేదికల క్రమంలో ఈ పరిణామంతో అత్యంత కీలకమైన ఆయువుపట్టు అయిన నమ్మకంపై దెబ్బకొట్టే ప్రయత్నాలకు దిగుతున్నారని , దీనిని ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తమ బాధ్యతగా తీసుకురావడం జరుగుతోందని ఈ లేఖలో తెలిపారు. అనుకూల తీర్పులు వెలువడాలి. ప్రతికూలత ఉండకూడదనే ఆలోచనలతో న్యాయవ్యవస్థను ప్రభావితం చేసే విధంగా జరుగుతోన్న తంతు రాజ్యాంగయుత న్యాయవ్యవస్థకు ఎంతటి అవలక్షణాన్ని తెచ్చిపెడుతుందనేది ఆలోచించాల్సి ఉందని పేర్కొన్నారు. రాజకీయ వ్యవహారాలలో ఇతరులను ప్రభావితం చేసేందుకు వాడుకునే వ్యూహాలను ఇప్పుడు న్యాయవ్యవస్థతో చెడుగుడు ఆడుకునేందుకు ప్రయోగిస్తున్న దశ అత్యంత బాధాకరం అవుతోంది. స్వార్థపర శక్తులు నేరుగానే జుడిషియరీని లక్షం చేసుకుని వ్యవహరిస్తున్నాయి. ప్రత్యేకించి అవినీతి అభియోగాలలో రాజకీయ ప్రముఖులకు సంబంధం ఉంటే, ఇటువంటి వ్యాజ్యాలు కోర్టులలోవిచారణలకు వస్తే రాజకీయ స్వార్థపర శక్తులు వ్యవహరిస్తున్న తీరు న్యాయవాద వృత్తిలోని వారికి తీవ్ర ఆక్షేపణీయం, గర్హనీయం, జరుగుతున్న పరిణామాలు పరాకాష్టకు చేరుతున్న దశలో స్పందించి ఈ లేఖ పంపిస్తున్నామని లాయర్ల బృందం తెలియచేసుకుంది.

ఈ వ్యవహారశైలిపై తీక్షణ దృష్టి అత్యవసరం
సార్వత్రిక ఎన్నికల దశలో జరుగుతున్న పరిణామాలపై న్యాయవ్యవస్థ కస్టోడియన్‌గా అత్యంత నిశిత పరిశీలన అవసరం . స్క్రూటిని అవసరం. న్యాయస్థానాలను రక్షించేందుకు ప్రధాన న్యాయమూర్తి వెంటనే కలుగచేసుకుని నిర్థిష్ట చర్యలు తీసుకోవల్సి ఉంది. ఈ దశలో ఓ విషయం ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువస్తున్నాం, ఓ నిర్థిష్టమైన స్వార్థపర శక్తుల వర్గం జుడిషియరీపై ఒత్తిడి తీసుకువస్తోంది. ప్రత్యేకించి న్యాయ ప్రక్రియను ప్రభావితం చేయాలని చూస్తోంది. ఈ దశలో కోర్టులను , ప్రక్రియను అప్రతిష్ట పాలు చేసేందుకు యత్నిస్తోంది. తమ రాజకీయ అజెండాల చలామణి పేరిట అత్యంత అసందర్భ తర్కంతో తంతు సాగిస్తోంది. దీనితో న్యాయవ్యవస్థలోని విశ్వాసం, సామరస్య వాతావరణం వెరశి సమగ్రతకు ముప్పు వాటిల్లుతోందని లాయర్లు ఈ లేఖలో తెలిపారు. ఇప్పుడు బుసలు కొడుతున్న శక్తులతో మన న్యాయస్థానాలు, మన ప్రజాస్వామిక సంవిధానానికి విఘాతం ఏర్పడుతోంది. గతంలో అంతా బాగుందనే సన్నాయి నొక్కులతో , అప్పట్లో న్యాయస్థానాలలో సువర్ణ అధ్యాయం ఉండేదనే మాటలతో , ఇప్పుడు జరుగుతున్న వాటిని అప్పటివాటితో పోలుస్తూ తప్పుడు ప్రచారానికి దిగుతున్నారు. ఇది కేవలం దురుద్ధేశపూరితం, కేవలం కోర్టుల రూలింగ్‌లు, తీర్పులను దెబ్బతీసేందుకు సాగిస్తున్న ప్రక్రియ అని విమర్శించారు. రాజకీయ స్వార్థం కోసం కోర్టులను చికాకు పెట్టే పరిస్థితి ఏర్పడటం ఇబ్బందికరం అవుతోంది. ఈ దశలో కొందరు లాయర్లు పగలు రాజకీయ నాయకులను వెనుకేసుకురావడం, తరువాత మీడియాలో కథనాల ద్వారా జడ్జిలను ప్రభావితం చేసేందుకు యత్నించడం జరుగుతోంది. పైగా ఏరికోరి ధర్మాసనాలను ఏర్పాటు చేస్తున్నారని, ఈ విధంగా బెంచ్ ఫిక్సింగ్ జరుగుతోందని, ఈ క్రమంలో తీర్పులు వెలువడుతున్నాయని ప్రచారం జరగడం దారుణం అని పేర్కొన్నారు. ఇదంతా కూడా ఏదో మార్గంలో కోర్టుల పనితీరులో జోక్యం చేసుకోవడం, ప్రభావితం చేయడం కిందికి వస్తుంది.

నచ్చితే ఓహోలు లేకపోతే చీచీలు
రాజకీయ శక్తులు కొందరికి నచ్చిన తీర్పులు వెలువడితే వాటిపై హర్షాలు వ్యక్తం చేయడం, వారికి నచ్చని విధంగా కోర్టు తీర్పులు వస్తే వాటిని చీల్చిచెండాడినట్లుగా వ్యవహరించడం పరిపాటి అవుతోంది. ఇటీవలి పలు తీర్పుల విషయంలో కూడా ఈ విధమైన ఏరికోరి ఎంచుకుని వ్యాఖ్యలకు దిగే పద్థతి నెలకొందని లాయర్ల బృందం తెలిపింది. న్యాయస్థానాలను దిగజార్చే లేదా న్యాయవ్యవస్థను దెబ్బతీసే ఎటువంటి రాజకీయ లేదా వ్యక్తిగత కారణాలను ఈ క్రమంలో అనుమతించరాదు. వర్తమాన స్థితిపై మౌనంగా ఉన్నా, ఏమి స్పందించకపోయినా అది చివరికి హాని తలపెట్టేవారు మరింతగా రెచ్చిపోయేందుకు దారితీస్తుంది. ఇటువంటి వ్యవహారంపై గౌరవప్రదమైన పెదవివిప్పని మౌనత్వం పనికిరాదని గుర్తించే ఈ లేఖ పంపిస్తున్నామని తెలిపారు. ఇటువంటి క్లిష్ట సమయంలో యువరానర్ , సార్ మీ నాయయకత్వ పటిమ అత్యవసరం. మిమ్మల్ని , ఇతర గౌరవనీయ న్యాయమూర్తులందరిని విశ్వసిస్తున్నాం, ఈ పరిస్థితుల్లో మార్గదర్శనం చేస్తారని, మన న్యాయస్థానాల పటిష్టతను కాపాడుతారని విశ్వసిస్తున్నామని ఈ లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News