హత్య కుట్రలో నిందితులకు కారు, రెండు కత్తులను అందజేసిన బిట్టు శ్రీను అరెస్టు : ఐజి నాగిరెడ్డి
మన తెలంగాణ/పెద్దపల్లి: మంథని మండలం గుంజప డుగు గ్రామానికి చెందిన న్యాయవాదులు గట్టు వామన్ రావు, పివి నాగమణిలను పాశవికంగా దాడి చేసి హత్య చేసిన ఘటనలో ముగ్గురు నిందితులు కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్కపాక కుమా ర్‌లను ఈ నెల 18న ఆరెస్టు చేయడం జరిగిందని, నిందితులు ఇచ్చిన వాంగ్మూలం సమాచారం ఆధారంగా బిట్టు శ్రీనుని గత నాలుగు రోజులుగా విచారించి సోమవారం రోజున అరెస్ట్ చేసినట్లు ఐజి నాగిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
బిట్టు శ్రీను, వామన్‌రావు దంపతుల మధ్య వైరం
మంథనికి చెందిన బిట్టు శ్రీను 2016 నుండి మంథనిలో నడుస్తున్న పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్‌గా కొనసాగుతున్నాడు. మంథని ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాడు. ఇట్టి ట్రస్టుపై మృతుడు గ ట్టు వామన్‌రావు ట్రస్ట్‌పై పలు ఆరోపణలు చేస్తూ, ప్రజల్లో చులకన చేస్తూ పలు వాట్సాప్ గ్రూప్‌లో సందేశా లు పంపించేవాడని, బిట్టు శ్రీనుపై అవమాన కరంగా అవినీతి చేస్తున్నాడని వామన్‌రావు ప్రచారం చేస్తూ, ట్రస్టు ఆదాయాలపై హైద్రాబాద్, ఇతర చోట్ల గట్టు వామన్‌రావు తన అనుచరులతో ఫిర్యాదులు చేయించే వాడు. 2015 నుండి 2019 ఏప్రిల్ వరకు మంథని గ్రామపంచాయతీలో బిట్టు శ్రీను చెత్త రవాణా కొరకు ఒక ట్రాక్టర్ పెట్టగా బిట్టు శ్రీను కు నెలకు రూ. 30 వేల ఆదాయం వచ్చేది. దానిపై 2019 మార్చిలో గ్రామ పంచాయతీలోని అధికారికి బిట్టు శ్రీను యొక్క ట్రాక్టర్‌పై ఫిర్యాదు చేసి దానిని తీసి వేయాలని పంచాయతీ అధికారిపై గట్టు వామన్‌రావు ఒ త్తిడి తీసుకురావడం జరిగింది. దీంతో ఆ ఆధికారి ట్రాక్ట ర్‌ని గ్రామ పంచాయతీ నుండి తోలగించాడు. దానిపై వచ్చే నెల వారి రూ. 30 వేల ఆదాయం కోల్పోవడం జరి గింది. ఈ విషయాన్ని గట్టు వామన్‌రావు బిట్టు శ్రీనుపై సాధిం చిన విజయంగా మంథని ప్రాంతంలో సోషల్ మీడి యాలో వామన్‌రావు ప్రచారం చేశాడు.
బిట్టు శ్రీను, కుంట శ్రీనుప్రాణ స్నేహితులు..
మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన కుంట శ్రీను, బిట్టు శ్రీనుకు గత ఆరేళ్లుగా పరిచయం ఏర్పడి ఇద్దరు ప్రాణ స్నేహితులుగా మారారు. రెగ్యులర్ గా కలిసి ఉండేవారు. వీరికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు మందు తాగే సమయంలో పంచుకునేవారు. వీళ్ళతో అప్పుడప్పుడు చిరంజీవి కూడా కలిసేవాడు. ఈ క్రమంలో గుంజపడుగు గ్రామస్తుడైన గట్టు వామన్‌రావు పివి నాగమణి దంపతులు గౌరవ హైకోర్టు న్యాయవాదు లుగా చలా మణి ఆవుతూ కొన్నేళ్లుగా కుంట శ్రీనివాస్‌ను టార్గెట్ చేసుకొని ఒక ఫోన్ కాల్ విషయంలో హైద్రాబా ద్ లో కుంట శ్రీనివాస్‌పై కేసు పెట్టించారు. కుంట శ్రీనును వాళ్ళ కుల దైవం పెద్దమ్మ తల్లి గుడి కట్టుటకు చైర్మన్‌గా పెట్టి గుడి కడుతున్న క్రమంలో దానిని ఆక్ర మ నిర్మాణం అని వామన్‌రావు దంపతులు ఫిర్యాదు చేసి నోటిసులు ఇప్పించి గుడి నిర్మాణం అపించడం జరిగిందని, కుంట శ్రీను ఇంటి నిర్మాణం చేస్తుండగా నిర్మాణం మధ్యలో ఉ న్నప్పుడు గ్రామ ఆనుమతి తీసుకోలేదని అక్ర మ ని ర్మాణం చేస్తున్నాడని నిర్మాణం అపుదల చేస్తూ గ్రామ నుండి నోటీసు ఇచ్చి నోటీసులను ప్లెక్సీ తయారు చేపించి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో గట్టు వామన్‌రావు ప్రచారం చేశారు.
నాలుగు నెలల క్రితమే హత్యకు కుట్ర
గుంజపడుగులో గల రామస్వామి, గోపాల స్వామి ఆల యానికి సంబంధించిన కమిటీ చైర్మన్‌గా చాలా సంవత్స రాల నుండి వామన్‌రావు తమ్ముడు చైర్మన్‌గా ఉండి కార్య క్రమాలు నిర్వహిస్తూ ఉండేవాడని, కొత్త కమిటీ చైర్మన్‌గా వెల్ది వసంతరావుని ఎన్నుకోవడం జరిగిందని, ఈ విష యంలో కూడా గట్టు వామన్‌రావు, నాగమణి, స్థానిక అధికారులకు ఫిర్యాదు చేస్తూ హైకోర్టులో ఫిర్యా దు చేయుటకు ప్రయత్నిస్తున్న క్రమంలో గొడవ జరిగిం ది. ఆ విధంగా కుంట శ్రీను గ్రామంలో తన అధిపత్యా నికి వామన్‌రావు నాగమణిలు అడ్డువస్తున్నారని, దానికి బిట్టు శ్రీను కూడా కుంట శ్రీనుతో తనకి కూడా ఆదాయ మార్గాలు రాకుండా చేసి ప్రజలలో అవమాన పరిచా డని, వ్యక్తిగతంగా తీవ్ర నష్టం చేశాడని గట్టు వామన్ రావుని చంపే విషయాలలో ఎలాంటి సహాయం కావా లన్నా చేస్తానని కుంట శ్రీనుతో చెప్పాడు. సుమారు నా లుగు నెలల క్రితం వామన్‌రావు గురించి చర్చించిన సమయంలో కుంట శ్రీను రెండు కత్తులు తయారు చే యించి పెట్టమని చెప్పగా, బిట్టు శ్రీనురెండు ట్రాక్టర్ పట్టీలు తీసుకొని మంథనిలో కత్తులు తయారు చే యించి చిరంజీవి ఇంట్లో పెట్టాడు.
అప్పుడు మిస్సయింది..
నాలుగు నెలల క్రితం వామన్‌రావు 15మందితో మూడు కార్లలో మంథని కోర్టుకు రాగా చిరంజీవి వారిని చూసి బిట్టు శ్రీనుకు చెప్పగా వెంటనే ఈ విషయం కుంట శ్రీనుకి బిట్టుతెలిపాడు. కుంట శ్రీను మంథనికి వచ్చే లోపే వామన్‌రావు మూడు కార్లలో గుంజపడుగు వ చ్చాడు. అప్పుడు హత్య చేసేందుకు వీలు కాదని చె ప్పగా ప్లాన్ విరమించుకున్నారు.
పకడ్బందీగా..
వామన్‌రావు హత్య పథకంలో ఎప్పుడు ఒంటరిగా దోరుకుతాడా అని ఎదురుచూస్తున్న క్రమంలో ఈ నెల 17న మధ్యాహ్నాం సమయంలో మంథని కోర్టుకు గట్టు వామన్‌రావు దంపతులు వచ్చారని తెలిసి కుంట శ్రీను బిట్టు శ్రీనుకి ఫోన్ ద్వారా తెలపగా కచ్చితంగా నిర్ధారణ చేసుకో అని చెప్పగా, అప్పుడు కోర్టు దగ్గరలో ఉన్న కుం ట లచ్చయ్యకి ఫోన్ చేసి వామన్‌రావు ఉన్నది నిజమని నిర్దారణ చేసుకొని మరల చెప్పడం జరిగింది. వెంటనే బిట్టు శ్రీను శివనందుల చిరంజీవికి ఫోన్ చేసి నీ దగ్గర ఉన్న కత్తులు తీసుకొని ఆర్జెంట్‌గా మంథని బస్‌స్టాప్ దగ్గ రికి రమ్మని చెప్పాడు. చిరంజీవి టు వీలర్‌పై కత్తులు తీసుకొని రాగా అంతలో బిట్టు శ్రీను తన కారును చిరం జీవికి ఇవ్వగా కత్తులు కారులో పెట్టుకొని కుంట శ్రీను వద్దకు వెళ్లి పోయాడు. రామగిరి మండలం, కల్వచర్ల సమీపంలో వామన్‌రావు, తన భార్య నాగమణి ఇద్దరిని చంపామని కుంట శ్రీను బిట్టు శ్రీనుకు ఫోన్లో తెలుపగా, మహారాష్ట్రకు పారిపోండని చెప్పిన బిట్టు శ్రీను ఇంటి వద్ద ఏం తెలియనట్టు ఉన్నాడు.
అన్ని కోణాల్లో విచారణ..
చిరంజీవి వాడిన మోటార్ సైకిల్, ఒక సెల్‌ఫోన్‌ను పో లీసులు స్వాధీనం చేసుకున్నారని, ఈ కేసు దర్యాప్తు ఇం కా కొనసాగుతుందని, అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుగుతూ ఆధారాలను శాస్త్రీయంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఇంకా కొంత మంది సాక్షులను కూ డా విచారించి వారి వాంగ్మూలం నమోదు చేయాల్సిన అవ సరం కూడా ఉంది. నిందితులందరిని పోలీస్ కస్టడికి తీసుకొని పూర్తిస్థాయి విచారణ జరిపి వారు ఇచ్చిన వాం గ్మూలంలోని ఆంశాలను పూర్తి స్థాయిలో నిర్ధారిం చాల్సి ఉందని, దీనికి గాను హైదరాబాద్ ఫోరెనిక్స్ సైన్స్ ల్యాబ్ నిపుణులు, సైబర్ క్రైం పరిశోధకులను విచారణ సహా యకులుగా తీసుకొని ముందుకు సాగడం జరుగు తుం దని అడిషనల్ డిసిపి ఆడ్మిన్ ఆశోక్‌కుమార్ ప్రధాన విచారణ అధికారిగా సమగ్ర విచారణ చేస్తున్నారు. సా క్షాలు గాని, హత్యకు సంబంధించిన వీడియోలు సమా చారం, ప్రత్యక్ష సాక్షాలు ఉన్నవారు ముందుకు వచ్చి సమాచారం అందిస్తే, ఇచ్చిన ప్రతి అంశాన్ని దర్యాప్తులో నిర్ధారించుకొని పరిశోధనలో ముందుకు పోవడం జరు గుతుందని కరీంనగర్ రేంజ్ ఇన్‌చార్జి డిఐజి ప్రమోద్ కుమార్ పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగుతుందని నార్త్ జోన్ ఐజి నాగిరెడ్డి వివరించారు.