Thursday, December 26, 2024

రాజ్యాంగ పరిరక్షణలో లాయర్లదే కీలక పాత్ర: కాసాని జ్ఞానేశ్వర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజ్యాంగ పరిరక్షణలో లాయర్లదే కీలక పాత్ర అని, సమాజంలోనూ వారే కీలకమని టిటిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో ఆదివారం పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ అధికారంలో ఏ పార్టీ ఉంటే పోలీసులు వారికి అనుకూలంగా మారుతున్నారని ఆయన ఆరోపించారు. న్యాయవాదులు అండగా ఉంటే హక్కుల సాధన తధ్యమన్నారు. టిడిపి విజయం కోసం న్యాయవాదులు కృషి చేయాలని ఆయన కోరారు.

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో లీగల్ సెల్ కమిటీలు వేయనున్నట్లు ఆయన తెలిపారు. నవ నిర్మాణ సమాజ అభివృద్ధి కోసం నిరంతరం పోరాడే గొప్ప విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఆయన పేర్కొన్నారు. అందరూ సమష్టిగా టిడిపికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. లీగల్- సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర ప్రతాప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన, ప్రధాన కార్యదర్శులు జక్కిలి ఐలయ్యయాదవ్, బండారి వెంకటేశ్వర్లు, నీలా పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News