మహబూబ్‌నగర్: ఎంఎల్‌ఎ లక్ష్మారెడ్డి ధ్యాస అంతా నియోజకవర్గం అభివృద్ధి పైనే ఉందని మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రి కెటిఆర్ పర్యటిస్తున్నారు. జడ్చర్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జడ్చర్ల మార్కెట్‌లో బహిరంగ సభలో కెటిఆర్ మాట్లాడారు. జడ్చర్లలో 150 వరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. రెండు చెరువులను మినీ ట్యాంక్ బండ్‌లుగా అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ పిలుపు మేరకు తెలంగాణ కోసం ఎంఎల్‌ఎ లక్ష్మారెడ్డి రాజీనామా చేశారని గుర్తు చేశారు. జడ్చర్లలో లక్ష్మారెడ్డి చేసిన అభివృద్ధి చూస్తే తనకు ఆశ్చర్యం వేసిందన్నారు. ఎంఎల్‌ఎ లక్ష్మారెడ్డి అందరిని ఒప్పంచి ఇక్కడ పరిశ్రమలు పెట్టించడంతో ఉద్యోగాలు రావడంతో పాటు భూముల రేట్లు పెరిగాయన్నారు. లక్ష్మారెడ్డి ముందుచూపుతో జడ్చర్ల ఎంతో అభివృద్ధి చెందిందని కెటిఆర్ ప్రశంసించారు. 15 కోట్ల రూపాయలతో జడ్చర్ల, బాదేపల్లి, కావేరమ్మ పేటలో సమగ్రాభివృద్ధి పనులు చేశామన్నారు. ప్రణాళిక బద్ధంగా పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందితేనే తెలంగాణ బాగుంటుందని కెసిఆర్ ఆలోచన అన్నారు. ఒక వైపు సంక్షేమ కార్యక్రమాలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నామన్నారు.
లక్ష్మారెడ్డి ధ్యాస అంతా నియోజకవర్గం అభివృద్ధిపైనే: కెటిఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -