Wednesday, January 22, 2025

వాళ్లు టామ్ అండ్ జెర్రీలు: లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్, బిఆర్‌ఎస్ వైఖరి టామ్ అండ్ జెర్రీ ఫైట్‌లా ఉందని రాజ్యసభ ఎంపి లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయం నుంచి ఎంపి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు వచ్చినప్పుడు తిట్టుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని, ధరణి మీద విచారణకు కమిటీ వేశారని, అతీగతీ లేదని మండిపడ్డారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల నుంచి ఫోన్ ట్యాపింగ్ చేసిందని, ఫోన్ ట్యాపింగ్‌లో అసలు దోషులను ఈ ప్రభుత్వం తప్పిస్తోందని దుయ్యబట్టారు. చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్‌పై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామని, గవర్నర్‌ను కలిసి ఫోన్ ట్యాపింగ్‌పై ఫిర్యాదు చేస్తామని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఎంఎల్‌సి కవితకు బెయిల్ రాలేదంటే ఆధారాలు గట్టిగా ఉన్నాయని తెలుస్తోందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News