Wednesday, January 22, 2025

లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూరు: అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించిన నేత కొండా లక్ష్మణ్ బాపూజీ అని బిసి రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ అన్నారు. కొండా లక్ష్మణ్‌బాపూజీ పదో వర్థంతి సందర్భంగా బుధవారం మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో ఆయన విగ్రహానికి బిసి రిజర్వేషన్ సాధన సమితి, పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వేర్వేరుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశత్వాన్ని ఎదురించిన నాయకుడని, 1969లో తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ బహుజన విప్లవవీరునిగా గుర్తింపు పొందారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో బిసి రిజర్వేషన్ సాధన సమితి నియోజకవర్గ అధ్యక్షులు, కార్యదర్శులు గుండు శ్రీను, నోముల రమేష్, పట్టణ అధ్యక్షుడు నిలిగొండ మత్సగిరి, బోనగిరి సతీష్, మల్లేష్, యాదయ్య, పద్మశాలి సంఘం మండల, పట్టణ నాయకులు పోచం కన్నయ్య, పోచం భిక్షపతి, నల్ల యాదగిరి, సిహెచ్.చంద్రమౌళి, వంగరి రాములు, ఎ.వెంకన్న, గుండు ప్రసాద్, జిల్లా రవీందర్, వేముల నర్సయ్య, పోచం కనకసేన, తాటి లక్ష్మణ్, పి.రమేష్, జె.సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News