Wednesday, January 22, 2025

కాంగ్రెస్ అంటేనే అబద్ధాలు, కుట్రలు: లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ పట్ల రాష్ట్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని బిజెపి ఎంపి డాక్టర్ కె లక్ష్మణ్ తెలిపారు. బిజెపి  కార్యాలయం నుంచి లక్ష్మణ్ మాట్లాడారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ ఒక్కటేనని ప్రజలు నమ్ముతున్నారని, కాంగ్రెస్ అంటేనే అబద్ధాలు, కుట్రలు కనిపిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేయాలో సిఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని కె లక్ష్మణ్ నిలదీశారు. గతంలో బిఆర్‌ఎస్ నేతలు అవినీతిపరులన్న సిఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు పార్టీలో చేర్చుకుంటున్నారని అడిగారు. తెలంగాణ అన్ని సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు దిక్కులేదని, రుణమాఫీ అనేది కాంగ్రెస్ ఎన్నికల స్టంట్ అని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News