Sunday, December 22, 2024

రాజ్యసభ అభ్యర్థిగా యుపి నుంచి లక్ష్మణ్ నామినేషన్

- Advertisement -
- Advertisement -

Laxman nominated as Rajya Sabha candidate from UP

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బిజెపి ఇతర సీనియర్ నాయకుల సమక్షంలో 8 మంది బిజెపి అభ్యర్థులు మంగళవారం రాజ్యసభ ఎన్నికలకు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అభ్యర్థులలో బిజెపి ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్, బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుఉ లక్ష్మీకాంత్ వాజపేయి, మిథిలేష్ కుమార్, రాధా మోహన్ దాస్ అగర్వాల్, సురేంద్ర సింగ్ నగర్, బాబూరాం నిషాద్, దర్శన సింగ్, సంగీత యాదవ్ ఉన్నారు. నామినేషన్ల కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రులు బ్రజేష్ పాఠక్, కేశవ్ ప్రసాద్ మౌర్య, ఇతర పార్టీ సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఖాళీ కానున్న 11 రాజ్యసభ స్థానాల నామినేషన్లకు మే 31 గడువు తేదీ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News