Wednesday, January 22, 2025

టీమిండియా తాత్కాలిక కోచ్‌గా లక్ష్మణ్?

- Advertisement -
- Advertisement -

Laxman to be Team India's interim coach?

 

ముంబై: సౌతాఫ్రికాతో సొంత గడ్డపై జరిగే టి20 సిరీస్‌లో టీమిండియా కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ వివిఎస్.లక్ష్మణ్‌ను ఎంపిక చేయాలని బిసిసిఐ వ్యూహాలు రచిస్తోంది. ఐపిఎల్ ముగిసిన వెంటనే సౌతాఫ్రికా సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్‌లో సీనియర్ క్రికెటర్లకు విశ్రాంతి ఇవ్వాలని బిసిసిఐ భావిస్తోంది. సీనియర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, బుమ్రా, భువనేశ్వర్, రిషబ్ పంత్, అశ్విన్ తదితరులు సిరీస్‌లో ఆడే అవకాశాలు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో హార్దిక్ పాండ్య, శిఖర్ ధావన్‌లలో ఒకరికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి జూనియర్ ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేయాలనే యోచనలో బిసిసిఐ పెద్దలు ఉన్నారు. ఇక ఈ సిరీస్‌కు లక్ష్మణ్‌ను తాత్కాలిక కోచ్‌గా ఎంపిక చేయాలని నిర్ణయించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే దీనిపై బిసిసిఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News