Monday, January 20, 2025

ఎన్‌టిఆర్‌ కడుపున పుడితే వారసులు కాదు: లక్ష్మీ పార్వతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వారసులమంటూ ఎవరెవరో డబ్బాలు కొట్టుకుంటున్నారని వైసిపి నేత లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. ఎన్‌ఆర్ శతజయంతోత్సవం సందర్భంగా లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడారు. కడుపున పుడితే వారసులు కాదని, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్‌కు చివరి వరకూ అండగా నిలబడిన వారే అసలైన వారసులని తెలిపారు. టిడిపి అధినేత, మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెన్నుపోటుపై ఎన్‌టిఆర్ ఎంతో బాధపడ్డారని, ఎన్‌టిఆర్‌ను చంద్రబాబు ఎన్నోసార్లు అవమానించారన్నారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్‌టిఆర్‌కు ఓ జిల్లా పేరు పెట్టడం గొప్ప విషయమని ప్రశంసించారు. సిఎం జగన్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నామని వివరించారు. ఎన్‌టిఆర్ ఆశయాలను సమాధి చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌టిఆర్ పేరు కాని, ఫోటో కాని పెట్టుకునే అర్హత చంద్రబాబు లేదన్నారు.

Also Read: జడ్చర్ల కాంగ్రెస్‌లో క్లారిటీ ఏదీ ?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News