Tuesday, December 24, 2024

లాయర్ల ఫీజు కోసం రూ.2 వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి…

- Advertisement -
- Advertisement -

అమరావతి: లాయర్లకు వేల కోట్ల ఫీజులు చెల్లించడానికి టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆ డబ్బులు ఎక్కడి నుంని వచ్చాయని వైసిపి నేత లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. దాచుకున్న అవినీతి సొమ్మును లాయర్లకు చెల్లించడానికే లోకేష్ ఢిల్లీలో మకాం పెట్టారని లక్ష్మీ పార్వతి విమర్శలు గుప్పించారు. 40 రోజులుగా చంద్రబాబు కోసం 19 మంది లాయర్లు పని చేస్తున్నారని, సీనియర్ లాయర్లకు రోజుకు రూ. కోటి నుంచి రూ.2.5 కోట్ల ఫీజు ఖర్చు అవుతుందని ఆరోపణలు చేశారు. లాయర్ల ఫీజుకే రూ.2 వేల కోట్లకు పైగా ఖర్చు ఉండొచ్చని, రెండు శాతం హెరిటేజ్ షేర్లను విక్రయిస్తే రూ.400 కోట్ల ఆదాయం వస్తుందని భువనేశ్వరి చెప్పారని లక్ష్మీ పార్వతి గుర్తు చేశారు. లాయర్ల ఫీజు చెల్లించడానికి ఎక్కడ నుంచి డబ్బులు వచ్చాయో చెప్పాలని చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులను నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News