సాయికిరణ్ అనే నటుడు అటు సినిమాలు ఇటు సీరియల్స్‌లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు. గుప్పెడంత మనసులో మహేంద్ర భూషణ్‌గా సాయి కిరణ్ నటిస్తున్నాడు. ఈ సీరియల్ టిఆర్‌పి రేటింగ్‌లో దూసుకెళ్తోంది. పడమటి సంధ్యారాగం సీరియల్‌లో కూడా అతడు కీలక పాత్ర పోసిస్తున్నాడు. ఓ తాజాగా ఇంటర్వూలో సాయి కిరణ్ పిచ్చాపాటిగా ముచ్చటించారు. లయ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రేమించు సినిమాలో లయతో కలిసి సాయి కిరణ్ నటించాడు. ఈ జంట చూడటానికి బాగుందని ప్రేక్షకులతో పాటు సాయి కిరణ్ తల్లిదండ్రులు అనుకున్నారు. లయ, సాయికిరణ్ జాతకాలు కలువకపోవడంతో పెళ్లి చేసుకోలేదని అతడు చెప్పాడు.
తమ మధ్య ప్రేమ లాంటివి ఏమీ లేవని, కానీ కుదిరితే పెళ్లి చేసుకుందామని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇప్పటికి మేమిద్దరం మంచి స్నేహితులుగా ఉన్నామని, తాను జాతకాలు గట్టిగా నమ్ముతానని, మా తల్లిదండ్రులు గట్టిగా విశ్వసిస్తారని చెప్పారు. ఒకప్పుడు తాను నమ్మేవాడిని కాదని, ఇప్పుడు వాటి గురించి తెలుసుకుంటున్నానని వివరణ ఇచ్చాడు. ప్రేమించు సినిమాలో అంధురాలిగా నటించేందుకు లయ ట్రైనింగ్ తీసుకోవడంతో పాటు ప్రాక్టీస్ చేశారు. ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా వరించింది. ఆ తరువాత రావే నా చెలియా, డార్లింగ్ డార్లింగ్, మనసుంటే చాలు, ఆడంతే అదో టైపు, పెళ్లి కోసం వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమ్లాలో నటిస్తునే సుడి గుండాలు, కోయిలమ్మ, అభిలాష, మౌనరాగం, ఇంటి గుట్టు వంటి సీరియల్స్‌లో నటించారు. బుల్లి తెరపై ప్రేక్షకుల మనుసు దోచుకున్నాడు.