రిటైర్ అయి కాంట్రాక్టు పద్ధతిలో
పని చేస్తున్న వారిని తొలగిస్తూ
ఉత్తర్వులు మెట్రో రైల్ ఎండి
ఎన్‌విఎస్ రెడ్డి, వైటిడిఎ వైస్
చైర్మన్ కిషన్‌రావు తదితరులకు
సర్కార్ ఉద్వాసన
మన తెలంగాణ/హైదరాబాద్ : 2014 నుంచి ఇప్పటివరకు రిటైర్ అయి వివిధ శాఖల్లో కొనసాగుతు న్న 177 మందిపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఈ నేపథ్యంలోనే రిటైర్‌మెంట్ అయి వివిధ హో దాల్లో కొనసాగుతున్న అధికారులు, ఉద్యోగులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువా రం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ప్ర భుత్వం తొలగించిన వారిలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, రీ అపాయింట్‌మెంట్ కింద పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు ఉన్నా రు. ఇందులో
మెట్రో రైల్ ఎండి ఎన్వీవిఎస్ రెడ్డి, హైదరాబాద్ వాటర్‌వర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణ, వైటిడిఏ వైస్ చైర్మన్ జి.కిషన్‌రావు, వైటిడిఏ చీఫ్ ఇంజనీర్, హెచ్‌ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్ రెడ్డి, హెచ్‌ఎండిఏ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ డి.భాస్కర్,
హెచ్‌ఎండిఏ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పి.రాములు, హెచ్‌ఎండిఏ ప్లాంటేషన్ అసిస్టెంట్ మేనేజింగ్ డైరెక్టర్ జి.ప్రభాకర్ రెడ్డి, హెచ్‌ఎంఆర్‌ఎల్ డైరెక్టర్, చీఫ్ జనరల్ మేనేజర్ హెచ్‌జిసిఎల్ ఓఆర్‌ఆర్‌లో పనిచేసే బి.ఆనందమోహన్, టిఎస్ రెరాలో జాయింట్ కలెక్టర్‌గా పనిచేసే ఎస్.సత్తయ్యలు ఉన్నారు. టియూఎఫ్‌ఐడిసి, విటిడిఏ, డిఎంఏ, హైదరాబాద్ వాటర్‌వర్క్, మెప్మా, ఈఎన్‌సి పిహెచ్, హెచ్‌ఆర్‌డిసిఎల్, కుడా, వైటిడిఏ, హెచ్‌ఎండిఏ. హెచ్‌ఎంఆర్‌ఎల్, టిఎస్ రెరా, సుడా, జిహెచ్‌ఎంసిలో పనిచేసే అధికారులు, ఉద్యోగులను ప్రభుత్వం తొలగించింది. వెంటనే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు.