Saturday, December 21, 2024

క్వాల్కామ్‌లో ఉద్యోగుల తొలగింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆర్థిక వ్యవస్థ మందగమనం ఆందోళనల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపులు పెరుగుతున్నాయి. ఉద్యోగులను తొలగించే జాబితాలో ఇప్పుడు చిప్‌లను తయారు చేస్తున్న బహుళజాతి కంపెనీ క్వాల్‌కామ్ కూడా చేరింది. దీర్ఘకాలిక వృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో 1500 మంది ఉద్యోగులను ఈ సంస్థ తొలగించవచ్చని తెలుస్తోంది. క్వాల్కామ్ మే 3న త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనుంది.

Also Read: ఆర్టీసీ చరిత్రను తిరగరాస్తాం: బండి సంజయ్

ఈ త్రైమాసిక ఫలితాలను వెల్లడించే సమయంలో చిప్ తయారీ సంస్థ తన ఉద్యోగుల తొలగింపుల సమాచారాన్ని ప్రకటించవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుత ప్రతికూల ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. గత కొన్ని నెలలుగా దాదాపు అన్ని టెక్ కంపెనీల విక్రయాలు క్షీణించగా, ఇది ఆ సంస్థల ఆదాయాన్ని ప్రభావితం చేసింది. దీంతో దిగ్గజ టెక్ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News