Saturday, November 2, 2024

కొత్త ఏడాదిలోనూ ఉద్యోగాల కోత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కొవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా మొదలైన లేఆఫ్‌ల పర్వం ఇంకా కొనసాగుతోంది.చిన్నా, పెద్ద కంపెనీలన్న తేడా లేకుండా అన్ని కంపెనీలు గత ఏడాది భారీగా ఉద్యోగులను తొలగించాయి. ఈ ఏడాది కూడా తొలగింపులను కొనసాగిస్తున్నాయి. ఈ ఏడాది ఒక్క జనవరి నెలలోనే 30 ఉద్యోగులను పలు కంపెనీలు తొలగించాయి. ఫిబ్రవరి 3 వరకు 122 టెక్ కంపెనీలు 31,754 మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి. లే ఆఫ్‌లను ట్రాక్ చేసే ‘ లేఆఫ్స్.ఎఫ్‌వైఐ’ ఈ విషయాన్ని తెలియజేసింది.పెద్ద టెక్ కంపెనీలనుంచి స్టార్టప్‌ల వరకు గత రెండేళ్లుగా 4.25 లక్షల మంది ఉద్యోగులను ఇంటికి పంపించినట్లు ఆ వెబ్‌సైట్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 2022లో 1.64లక్షల మందిని, 2023లో 2.62 లక్షల మందిని కంపెనీలు తొలగించాయి. భారత్‌లోనే ఈ రెండేళ్లలో 36 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు.

ఇక ప్రస్తుత సంవత్సరం కోతల విషయానికి వస్తే ప్రముఖ వీడియో కమ్యూనికేషన్ యాప్ జూమ్ 150 మందిని తొలగించింది. క్లౌడ్ సాఫ్ట్‌వేర్ వెండర్ ఓక్తా 400 మందికి ఉద్వాసన పలికింది.ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే పేపాల్ గత నెలో ఏకంగా 2,500 మందిని తొలగించింది. ఐరోబో 350,సేల్స్‌ఫోర్స్700,స్విగీ ్గ300 400, ఈబే 1000 చొప్పున ఉద్యోగాలను తొలగించాయి. ప్రపంచంలోని అతిపెద్ద సంస్థ అయిన గూగుల్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. డిసెంబర్‌జనవరి మధ్య వెయ్యిమందిని తొలగించగా భవిష్యతులోనూ మరికొంతమందిని తొలగిస్తామని ఇప్పటికే ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News