Tuesday, November 5, 2024

సిఎంఒ కార్యాలయంలో కేటు గాడు అరెస్టు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: సిఎంఒ కార్యాలయంలో ఓ వ్యక్తి అరెస్టు కలకలం రేపుతోంది. తెలంగాణ సిఎం పబ్లిసిటీ సెల్ లో ఓ దొంగ ప్రోటోకాల్ ఆఫీసర్ అవతారం ఎత్తి అరెస్ట్ అయ్యాడు. ల్యాండ్ సెటిల్మెంట్స్, అసైన్డ్ ల్యాండ్ రీ అసైన్డ్ చేస్తానంటూ మోసాలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పలువురికి సిఎం ప్రోటోకాల్ నకిలీ స్టిక్కర్స్ అత్తిలి ప్రవీణ్ సాయి అనే వ్యక్తి ఇప్పించాడు. హోం మినిస్టర్, మినిస్టర్స్ లెటర్ హెడ్స్ తో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసాలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడు ప్రవీణ్ సాయి వనస్థలిపురంలో నివాసం ఉంటున్నాడు. ఆరు నెలల క్రితం ప్రభుత్వ పైరవీలు చేస్తూ పలువురికి శఠగోపం పెట్టాడు. ప్రవీణ్ సాయిని ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన నిందితుడి వద్ద నుంచి ఇన్నోవా కార్, సెల్ ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News