Tuesday, December 24, 2024

పిస్తోల్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః కంట్రీమేడ్ పిస్తోల్ వియ్రిస్తున్న వ్యక్తిని ఎల్‌బి నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి పిస్తోల్, ఒక రౌండ్, ఖాళీ కాట్రీడ్జ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎల్‌బి నగర్ డిసిపి సాయిశ్రీ తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జార్ఖండ్ రాష్ట్రం, సాహెబ్‌గంజ్ జిల్లా, మాసన్య గ్రామానికి చెందిన మహ్మద్ షాబుద్దిన్ అన్సారీ నిర్మాణ రంగంలో కూలీ పనిచేస్తున్నాడు. పనికోసం వచ్చిన నిందితుడు రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలం,గ్రామంలో స్థిరపడ్డాడు.

అయితే సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన నిందితుడు తన సొంత రాష్ట్రానికి వెళ్లి కంట్రీమేడ్ పిస్తోల్‌ను కొనుగోలు చేసి తీసుకుని వచ్చాడు. నగరంలో అవసరం ఉన్న వారికి ఎక్కువ ధరకు విక్రయించాలని ప్లాన్ వేశాడు. జార్ఖండ్ నుంచి రైలులో వచ్చిన నిందితుడు సికింద్రాబాద్‌లో రైలు దిగి నేరుగా ఎల్‌బి నగర్‌కు వెళ్లి పిస్తోల్ విక్రయించేందుకు ప్రయత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇన్స్‌స్పెక్టర్ అంజిరెడ్డి, డిఐ తదితరులు నిందితుడిని పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News