Sunday, November 17, 2024

అపార్ట్‌మెంట్ వివాదంలో కేసు నమోదు

- Advertisement -
- Advertisement -
LB Nagar police registered case in apartment dispute
మీర్‌పేట డిఐపై బాధితుల ఆరోపణలు
బలవంతంగా వెకెట్ చేయించారని విమర్శలు
దర్యాప్తు చేస్తున్న ఎల్‌బి నగర్ పోలీసులు

హైదరాబాద్: అపార్ట్‌మెంట్ వివాదంలో ఎల్‌బి నగర్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… ఎల్‌బి నగర్‌లోని నవోదయ కాలనీ, గురుదత్తా నివాస్ అపార్ట్‌మెంట్స్‌లో సికింద్రాబాద్‌కు చెందిన పద్మజా ఫ్లాట్ నంబర్ 304ను కొనుగోలు చేసింది. ముందుగా డ్వాన్స్ రూ.10లక్షలు ఇచ్చి, మిగతాది లోన్ పెట్టింది. ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావడంతో రామంతాపూర్‌కు చెందిన కదిరి శేఖర్ రెడ్డి అనే వ్యక్తికి ఫ్లాట్‌ను సెల్ కమ్ డీడ్ చేసుకుంది. దీంతో శేఖర్ రెడ్డి ఫ్లాట్ పొజీషన్‌ను తీసుకున్నాడు. ఈ క్రమంలోనే పద్మజా 2019లో వీరశివాజీ వద్ద రూ.5లక్షలు అప్పుగా తీసుకుంది. దీనిని అడ్వాన్‌టేజ్‌గా తీసుకున్న వీరశివాజీ తన డబ్బులు చెల్లించాల్సిందిగా ఒత్తిడి తీసుకువచ్చాడు. ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో పద్మజ డబ్బులను తిరిగి ఇవ్వలేకపోయింది.

తనకు ఫ్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేయించాలని ఒత్తిడి తీసుకువచ్చాడు. ఒత్తిడిని తట్టుకోలేక పద్మజా జనవరి 15, 2021లో వీరశివాజీ పేరుపై రిజిస్ట్రేషన్ చేసింది. కానీ శేఖర్ రెడ్డితో చేసుకున్న సేల్ అగ్రిమెంట్‌ను రద్దు చేసుకోకుండానే వీరశేఖర్‌కు రిజిస్ట్రేషన్ చేసింది. కానీ పొజీషన్‌లో శేఖర్ రెడ్డి ఉన్నారు. దానిని విద్యార్థులకు అద్దెకు ఇచ్చాడు. వీర్‌శేఖర్ న్యాయస్థానం నుంచి పొజీషన్ తీసుకోకుండా అక్రమంగా ఫ్లాట్‌లోకి వెళ్లి అందులో ఉంటున్న వారిని బలవంతంగా ఖాళీ చేయించి లాక్ వేసుకున్నాడు. అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న శేషన్ యాదగిరి స్వామి తాళం పగులగొట్టి పొజిషన్ తీసుకున్నాడని ఈ నెల 11వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన ఎల్‌బి నగర్ పోలీసులు నిందితుడిపై సెక్షన్ 341, 427, 448, 506/ రెడ్‌విత్ 34 ఐపిసి కింద కేసు నమోదు చేశారు.

మీర్‌పేట డిఐ పాత్రపై విచారణ చేస్తున్నాం…

మీర్‌పేట పోలీస్ స్టేషన్ డిఐపై పలు ఆరోపణలు వచ్చాయి. తనకు వరుసకు సోదరుడైన వ్యక్తిపై రిజిస్ట్రేషన్ చేయించి బాధితులను బెదిరించారని బాధితుడు శేఖర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. శివాజీకి సహకరించాడని విమర్మించారు. డిఐ పాత్రపై విచారణ చేస్తున్నామని, విచారణలో డిఐకి సంబందం ఉందిలేనిది తెలుస్తుందని ఎల్‌బి నగర్ పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News