- Advertisement -
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఎల్ బి నగర్ ప్రాంతం వనస్థలిపురంలోని గౌతమి నగర్ లో దారుణం చోటుచేసుకుంది. కానిస్టేబుల్ కుంచపు రాజ్ కుమార్ తన భార్యను హత్య చేశాడు. భార్య శోభ మెడను భర్త కత్తితో కోసి భవనం పైనుంచి కిందకు తోసేశాడు. దీంతో భార్య ఘటనా స్థలంలోనే చనిపోయింది. హైకోర్ట్ లో 4వ గేట్ వద్ద కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. అక్రమ సంబందం కారణంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఎల్ బి నగర్ డిసిపి సాయి శ్రీ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: వరంగల్‌లో వైద్యురాలు ఆత్మహత్య
- Advertisement -