Sunday, January 19, 2025

చైతన్యపురిలో కారు బీభత్సం… ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓ మద్యం మత్తులో ఓ వ్యక్తి కారును నడిపి బీభత్సం సృష్టించిన సంఘటన హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రాజీవ్‌గాంధీనగర్ వద్ద కారు అతివేగంగా వచ్చి పాదచారులపైకి దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందారు. కమాన్ దిమ్మను కారు ఢీకొట్టడంతో వాహనంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఎల్‌బి నగర్ నుంచి ఉప్పల్ రహదారిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కారులో ఉన్న డ్రైవర్‌తో సహా ఏడుగురు మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News